AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె ఓ హీరోయిన్.. భర్త టాలీవుడ్‌లో విలన్.. రూ. 485 కోట్లుకు మహారాణి ఈ బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి రాణిస్తున్నారు. వారిలో ఈ అందాల భామ ఒకరు. ఆమె భర్త కూడా నటుడే..టాలీవుడ్ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఆమె ఆస్తులు వందల కోట్లు.. ఇంతకూ ఆమె ఎవరంటే

ఆమె ఓ హీరోయిన్.. భర్త టాలీవుడ్‌లో విలన్.. రూ. 485 కోట్లుకు మహారాణి ఈ బ్యూటీ
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2025 | 2:01 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. అలాగే లేడీఓరియేంటేడ్ సినిమాలు కూడా ఎక్కువగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే హీరోయిన్స్ చాలా మంది హీరోలకు సమానంగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. హీరోలకు సరిసమానం గా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అయితే పైన కనిపిస్తున్న భామ సీనియర్ హీరోయిన్. చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తోంది. జోరు తగ్గింది.. వయసు పెరిగింది.. కానీ ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే వయ్యారంతో ఆకట్టుకుంటుంది ఆ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? వయసు పెరిగినా కూడా రెమ్యునరేషన్ లో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఒకొక్క సినిమాకు దాదాపు 10కోట్లు అందుకుంటుంది ఆమె. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా.. షాకింగ్ విషయం చెప్పిన నటుడు

అందంలో ఆమెను కొట్టేవాళ్లే లేరు. ఇంతకూ ఆమె ఎవరంటే..? పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్. కరీనా కపూర్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఈ ఏడాది విడుదలైన కరీనా నటించిన ‘క్రూ’ చిత్రం విజయవంతమైంది. అలాగే ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ చిత్రం కూడా ప్రశంసలు అందుకుంది. కరీనా కపూర్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతుంది.

ఇవి కూడా చదవండి

చేసింది ఒకే ఒక్క సినిమా.. అది కూడా స్టార్ హీరోతో.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి.

‘జబ్ వి మెట్’, ‘కభీ ఖుషీ కభీ గమ్’ వంటి సినిమాలు ఆమె క్రేజ్ ను పెంచేశాయి. కరీనా తండ్రి రణధీర్ కపూర్ సూపర్ స్టార్. ఆమె తల్లి బబిత. కరీనాకు చిన్న వయసులోనే హీరోయిన్ కావాలనే కోరిక ఉండేది. ‘కహో నా ప్యార్ హై’ సినిమా ద్వారా కరీనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈ అమ్మడు సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకుంది. కరీనా కపూర్ నికర విలువ రూ. 485 కోట్ల రూపాయలు. ఒక్కో సినిమాకు 10-12 కోట్ల రూపాయలు అందుకుంటుంది. అలాగే బ్రాండ్ ప్రమోషన్‌తో రూ.5 కోట్లు అందుకుంటుంది.

చేసింది 8 సినిమాలు అందులో ఆరు ఫ్లాపులు.. అందంలో మాత్రం అజంతా శిల్పం

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..