SSMB 29: జక్కన్న ప్లాన్ అదిరింది.. మహేష్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ?.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..
ఈ సినిమా విడుదలైన వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు మహేష్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే మహేష్ తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని జక్కన్న చెప్పడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను సరిహద్దులు దాటి హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తైందని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్ షో తర్వాత మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలైన వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు మహేష్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే మహేష్ తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని జక్కన్న చెప్పడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను సరిహద్దులు దాటి హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తైందని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మహేష్ ఈ సినిమా కోసం జర్మనీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అక్కడి నుంచి భారత్ వచ్చిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది. అయితే మరోవైపు ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటికీ ఎలాంటి అఫీషియల్ రాలేదు.. నాగార్జునకు.. రాజమౌళి కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా నాగార్జునకు ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ మూవీలో నాగ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చక్కర్లు కొడుతుంటాయి. ఇందులో హాలీవుడ్ నటీనటులు కనిపించనున్నారని టాక్. అలాగే ఆఫ్రీకా అడువుల నేపథ్యంలో అడ్వంచరస్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




