Thandel Movie: ‘సాయి పల్లవి ట్యాలెంట్ చూస్తేఆశ్చర్యమేస్తోంది’.. నాగ చైతన్య తండేల్‌పై అక్కినేని నాగార్జున

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఫిబ్రవరి 07న థియటేర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున తండేల్ సక్సెస్ పై స్పందించారు.

Thandel Movie: సాయి పల్లవి ట్యాలెంట్ చూస్తేఆశ్చర్యమేస్తోంది.. నాగ చైతన్య తండేల్‌పై అక్కినేని నాగార్జున
Akkineni Nagarjuna

Updated on: Feb 10, 2025 | 3:40 PM

లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మరో చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం ఫిబ్రవరి 07న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు (మూడు రోజులకు గానూ) తండేల్ మూవీ రూ. 62 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా తండేల్ గ్రాండ్ సక్సెస్ తో అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో అక్కినేని నాగార్జున తండేల్ సక్సెస్ పై స్పందించారు. తన కొడుకు చైతూ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

‘ప్రియమైన చైతూ.. నా కొడుకుగా నిన్ను చూసి గర్వపడుతున్నా. తండేల్‌ ఒక సినిమా మాత్రమే కాదు. ఇది నీ ఎనలేని అభిరుచికి, నీ కృషికి, పెద్ద కలలు కనే ధైర్యానికి నిదర్శనం. అక్కినేని అభిమానులందరూ ఓ కుటుంబంలా మాకు అండగా నిలిచారు. తండేల్‌ విజయం మనందరిదీ. మీ అంతులేని ప్రేమాభిమానాలు, మద్దతుకు ధన్యవాదాలు. అల్లుఅరవింద్, బన్నీ వాసుకు కృతజ్ఞతలు. సాయిపల్లవి అద్భుతమైన టాలెంట్‌ నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్షణాలను మరిచిపోలేని విధంగా చేసిన డైరెక్టర్ చందూమొండేటి, రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌, అద్భుతమైన తండేల్‌ బృందానికి అభినందనలు’ అని ట్వీట్ చేశాడు నాగార్జున.

ఇవి కూడా చదవండి

అక్కినేని నాగార్జున ట్వీట్..

కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.