AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: ధనుష్ డైరెక్షన్‌లో క్రేజీ మూవీ.. జాబిలమ్మ నీకు అంతా కోపమా ట్రైలర్ అదిరిపోయిందిగా..

ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఫిబ్రవరి 21న చిత్రం విడుదల చేయనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూత్ ను ఆకట్టుకునే కథతో ఈ సినిమా తెరక్కిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

Dhanush: ధనుష్ డైరెక్షన్‌లో క్రేజీ మూవీ.. జాబిలమ్మ నీకు అంతా కోపమా ట్రైలర్ అదిరిపోయిందిగా..
Danush
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2025 | 2:55 PM

Share

పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ అంటూ దర్శకుడిగా మరోసారి అందరినీ మెప్పించేందుకు రెడీ అయ్యారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేస్తోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను పెంచేశారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రారంభంలో.. ధనుష్ కనిపించి ఇదొక సాధారణ ప్రేమ కథ అని అసలు కథలోకి తీసుకెళ్తాడు. ఓ ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. మాజీ ప్రేయసి పెళ్లి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, అక్కడ ఎదురయ్యే సంఘటనలు, ఇలా అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గ స్టోరీతో ధనుష్ రాబోతోన్నాడని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ఇలా అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ స్పెషల్ అప్పియరెన్స్, ఆ పాటకు సంబంధించిన బిట్ కూడా ట్రైలర్‌లో పొందు పర్చారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా లియోన్ బ్రిట్టో, ఎడిటర్‌గా జి.కె. ప్రసన్న పని చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర