AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranthiki Vasthunam: ఓటీటీకంటే ముందే ఛానెల్‌లోకి బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఎప్పుడంటే

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు.

Sankranthiki Vasthunam: ఓటీటీకంటే ముందే ఛానెల్‌లోకి బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఎప్పుడంటే
Sankranthiki Vasthunnam
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2025 | 4:06 PM

Share

ఈ ఏడాది సంచలన విజయం సాధించిన సినిమా అంటే టక్కున చెప్పే పేరు సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులచేత నవ్వులు పూయించారు. అలాగే వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. తొలి షో నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీమ్ మొత్తం ఆనందంలో తేలిపోతున్నారు.

ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాగా ఈ సినిమాలల్లో సంక్రాంతి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. వెంకటేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా వెంకటేష్ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా తన నటనతో అలరించింది. అనిల్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

ఈ మూవీ ఓటీటీ కంటే ముందు టీవీలోకి రానుందని తెలుస్తుంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రముఖ ఛానెల్ జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు అధికారికంగా ప్రకటించింది. కాగా ఫిబ్రవరి మూడో వారంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ 5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఛానెల్ లో సినిమా టెలికాస్ట్ అనౌన్స్ చేయడం తో అభిమానులు అవాక్ అవుతున్నారు. త్వరలోనే సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం