Love Story Pre Release Event: నాగచైతన్య, సాయి పల్లవి అందమైన ప్రేమకథ.. లవ్‏స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

అక్కినేని నాగచైతన్య... నాగచైతన్య జంటగా క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన

Love Story Pre Release Event: నాగచైతన్య, సాయి పల్లవి అందమైన ప్రేమకథ..  లవ్‏స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
Love Story Pre Release Even
Follow us

|

Updated on: Sep 19, 2021 | 7:16 PM

అక్కినేని నాగచైతన్య… నాగచైతన్య జంటగా క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీ గతంలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవల వినాయక వినాయక చవితి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్‏లోని థియేటర్స్ సమస్యలతో మరోసారి వెనక్కు తగ్గింది. ఇదిలా ఉంటే.. వరుస వాయిదాల అనంతరం ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఈ నెల 24న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ అయిన గంటల్లోనే ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టించింది. అలాగే రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను హైదరాబాద్‍లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ వేడుకను మీరు టీవీ9 తెలుగులో లైవ్‏లో చూడవచ్చు. ఇక లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. మరికాసేపట్లో ఈ వేడుక ప్రారంభం కానుంది.

Also Read:

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..