Akhil Akkineni : సాలిడ్ హిట్ కోసం స్టైలిష్ డైరెక్టర్‌నే నమ్ముకున్న అక్కినేని కుర్ర హీరో..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Akhil Akkineni : సాలిడ్ హిట్ కోసం స్టైలిష్ డైరెక్టర్‌నే నమ్ముకున్న అక్కినేని కుర్ర హీరో..
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 24, 2022 | 7:11 AM

Akhil Akkineni : అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  సినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూసిన అఖిల్ కు ఎట్టకేలకు హిట్ ఇచ్చాడు దర్శకుడు బిమ్మరిల్లు భాస్కర్. ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు ఈ కుర్ర హీరో. అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా `ఏజెంట్` ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఏజెంట్సినిమాను చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ భావిస్తుంది. దాంతో ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోందని అర్ధమవుతుంది. `ఏజెంట్`లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నాడు. అందుకోసం తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు అఖిల్. ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా అక్కినేని అభిమానులకు అది సరిపోలేదు. దాంతో ఈ సినిమాపై అఖిల్ తోపాటు అక్కినేని అభిమానులు కూడా బోలెడన్ని ఆశలతో ఉన్నారు. మరో వైపు ఈ సినిమాలో మమ్ముట్టి కూడా పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ ఇద్దరికి సంబంధించిన పోస్టర్లు సినిమా పై అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఈ  చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరింత దూకుడు పెంచిన ఈడీ.. వారిపై కోర్టు ధిక్కరణ ఫిటిషన్‌ దాఖలు..

Viral Photo: కురుల మాటున అందాల మకరందం.. కుర్రాళ్ల గుండెల్లో సునామీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!

RRR Movie: ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ విడుదలపై కన్నడిగుల ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చుకున్న చిత్రయూనిట్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే