Akhil Akkineni: స్మార్ట్ బాయ్ ఇలా మారిపోయాడేంటీ.. కొత్త లుక్‎లో షాకిచ్చిన అఖిల్.. ఎందుకోసం.. ?

దాదాపు రెండేళ్లపాటు పడిన కష్టం అంతా వృథా అయ్యింది. ఏజెంట్ డిజాస్టర్ కావడంతో అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏజెంట్ రిలీజ్ అయి ఏడాది అయినా ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అలాగే అటు మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నాడు. చాలా కాలం తర్వాత ఆకస్మాత్తుగా ఎయిర్ పోర్టులో కనిపించాడు అఖిల్.

Akhil Akkineni: స్మార్ట్ బాయ్ ఇలా మారిపోయాడేంటీ.. కొత్త లుక్‎లో షాకిచ్చిన అఖిల్.. ఎందుకోసం.. ?
Akhil Akkineni
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 11, 2024 | 5:30 PM

అక్కినేని అఖిల్ బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమయ్యింది. గతేడాది ఏప్రిల్‏లో ఏజెంట్ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ చివరకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ కోసం అఖిల్ పూర్తిగా తన లుక్ మార్చేసి.. సిక్స్ ప్యాక్ బాడీతో కఠినమైన స్టంట్స్ చేసినా ఆశించిన ఫలితం మాత్రం రాలేకపోయింది. దాదాపు రెండేళ్లపాటు పడిన కష్టం అంతా వృథా అయ్యింది. ఏజెంట్ డిజాస్టర్ కావడంతో అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏజెంట్ రిలీజ్ అయి ఏడాది అయినా ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అలాగే అటు మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నాడు. చాలా కాలం తర్వాత ఆకస్మాత్తుగా ఎయిర్ పోర్టులో కనిపించాడు అఖిల్.

తన కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాడు అఖిల్. ఏప్రిల్ 8న తన పుట్టినరోజు వేడుకలను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుని తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక ఈరోజు ఎయిర్ పోర్టులో అఖిల్ న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో అఖిల్ కొత్త లుక్ లో కనిపించాడు. ఇప్పుడు ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు ఇలాంటి లుక్ లో అఖిల్ కనిపించలేదు. అయితే అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసమే ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఏజెంట్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు పీరియాడిక్ చిత్రంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారని.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ఇక ఇప్పుడు ఎలాగైన హిట్ అందుకోవాలని ఆలస్యమైన కథపై మరింత ఫోకస్ పెట్టాడట అఖిల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం