Vinoth: విజయ్ వారసుడు సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేసిన అజిత్ డైరెక్టర్
అజిత్ కంటే విజయ్ గొప్ప నటుడు అని నిర్మాత దిల్ రాజు అనడం తమిళనాడులో అగ్గిరాజేస్తోంది. దీన్ని మేము సహించబోమని అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు కు అల్టిమేటం ఇచ్చారు. విజయ్ కన్నా మా హీరోనే మంచి నటుడంటూ అజిత్ ఫ్యాన్స్..
తమిళనాట ఫ్యాన్ వార్ గురించి అందరికి తెలిసిందే.. అజిత్, విజయ్ అభిమానుల మధ్య నిత్యం ఎదో ఒక వివాదం చెలరేగుతూ ఉంటుంది. తమిళనాట మరోసారి ఫ్యాన్స్ రగడ రచ్చ రచ్చగా మారింది. వారసుడు సినిమా నిర్మాత …తమ హీరోని తక్కువ చేసి మాట్లాడారంటూ ఫ్యాన్స్ మధ్య గొడవ రచ్చ రంబోలాగా మారింది. అజిత్ కంటే విజయ్ గొప్ప నటుడు అని నిర్మాత దిల్ రాజు అనడం తమిళనాడులో అగ్గిరాజేస్తోంది. దీన్ని మేము సహించబోమని అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు కు అల్టిమేటం ఇచ్చారు. విజయ్ కన్నా మా హీరోనే మంచి నటుడంటూ అజిత్ ఫ్యాన్స్… ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతోంది. ఈ క్రమంలో అజిత్ నటిస్తున్న తునీవు ఇదే సినిమా తెలుగులో తెగింపు అనే టైటిల్ తో రాబోతుంది. ఇక విజయ్ వారీసు సినిమా వారసుడు గా రానుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకొని రిలీజ్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాల రిలీజుల విషయంలో కూడా అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే అజిత్ మూవీ తెగింపు దర్శకుడు హెచ్ వినోద్ విజయ్ గురించి ఆయన సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అజిత్ తో సినిమా చేసినప్పటికీ నేను విజయ్ సినిమానే ఫస్ట్ చూస్తా అని స్టేట్ మెంట్ ఇచ్చాడు వినోద్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ.. తను రూపొందించిన `తునీవు` సినిమాని చాలా సార్లు చూశానని అందుకే ముందు విజయ్ వారసుడు సినిమాని చూడాలని అనుకుంటున్నానని హెచ్ వినోద్ చెప్పుకొచ్చారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.