Deepika Padukone: ఫిఫా వరల్డ్‌కప్‌లో మెరిసిన దీపికా.. జస్ట్ ఆస్కింగ్ అంటూ కౌంటర్ వేసిన ప్రకాష్ రాజ్..
ఈ మ్యాచ్ సందర్భంగా పలువురు సినిమా తారలు ఖతర్ లో మెరిశారు. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, దీపికా పదుకొనె, నోరా ఫతేహి, మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఖతర్ వెళ్లారు.
ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ లో అర్జెంటీనా అద్భుత విజయాన్ని అందుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా 42 తేడాతో విజయం సాధించి టైటిల్ విజేతగా అవతరించింది. ఖతర్ వేదికగా లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలవడంతో ఆ జట్టుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా పలువురు సినిమా తారలు ఖతర్ లో మెరిశారు. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, దీపికా పదుకొనె, నోరా ఫతేహి, మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఖతర్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఫైనల్ కు ముందు మైదానంలో దీపిక ప్రపంచ కప్ ట్రోఫీని విడుదల చేసింది.
నోరా ఫతేహి ఫైనల్ సందర్భంగా ఏర్పాటు చేసిన ముంగిపు వేడుకల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. తన డాన్స్ తో ఈ మ్యాచ్ వీక్షించే అభిమానులను అలరించింది నోరా. డాన్స్ తోనే కాదు పాట కూడా పడుతూ అలరించింది నోరా. ఇదిలా ఉంటే దీపికా పదుకొనె ప్రపంచ కప్ ట్రోఫీని విడుదల చేయడం విశేషం.
ఫిఫా కప్ ఫైనల్స్ లో ఇండియన్ కి కూడా చోటు దక్కడం విశేషమే. అందులోనూ దీపికా మీద దేశీయంగా ఓ సెక్షన్ రాద్ధాంతం చేస్తున్న వేళ ఈ గుర్తింపు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే భారతీయ మీడియాలో ప్రాధాన్యత దక్కకపోవడం గమనార్హం. అయినా తొలిసారిగా లభించిన ఇలాంటి గౌరవం గురించి ప్రస్తావించడానికి మన మీడియా ఎందుకు ఆసక్తి చూపలేదో.? ఇదిలా ఉంటే దీపికా కు సపోర్ట్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది దీపికపదుకొనే. బేషరమ్ బిగోట్స్ ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్‌ను కూడా బ్యాన్ చేస్తారా..? జెస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్
Proud of you @deepikapadukone .. Will #BesharamBigots BAN #FIFAWorldcup now #KhelaHobe …#justasking pic.twitter.com/q5iNux66JT
— Prakash Raj (@prakashraaj) December 19, 2022
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చూడండి..