Ajith Kumar Birth Day: అజిత్‌కు ఎంతో ఇష్టమైంది గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన షాలిని.. అదేంటంటే
అజిత్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ తో అదరగొడుతున్నారు. చివరిగా తునివు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు అజిత్. ఇక ఇప్పుడు విడా ముయార్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుంది. ఇదిలా ఉంటే నేడు అజిత్ కుమార్ పుట్టిన రోజు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు తెలుగునాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయన సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అజిత్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ తో అదరగొడుతున్నారు. చివరిగా తునివు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు అజిత్. ఇక ఇప్పుడు విడా ముయార్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుంది. ఇదిలా ఉంటే నేడు అజిత్ కుమార్ పుట్టిన రోజు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ అజిత్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రెటీలు కూడా అజిత్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే భర్త పుట్టిన రోజు సందర్భంగా అజిత్ భార్య షాలిని ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. అజిత్ కు రేసింగ్ అంటే ఇస్తామన్న విషయం తెలిసిందే. పలు బైక్ రేసుల్లోనూ పాల్గొని మెడల్స్ సంపాదించాడు. ఈ క్రమంలోనే అజిత్ బర్త్ డే సందర్భంగా షాలిని ఓ స్పోర్ట్స్ బైక్ ను గిఫ్ట్‌గా ఇచ్చింది. డుకాటీ బైక్ ను అజిత్ కు బర్త్ డే గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అజిత్ సినిమాల విషయానికొస్తే తునివు సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నారు అజిత్ ఇప్పుడు విడా ముయార్చి అనే సినిమా చేస్తున్నారు. ఈసినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రానున్నాయి. ఇక అజిత్ కు షాలిని గిఫ్ట్ గా ఇచ్చిన బైక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.