Balakrishna: బాలయ్య కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్యారాయ్.. వీడియో వైరల్.. అందాల తారపై ప్రశంసల వర్షం

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ తమిళంలో ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో ఐశ్వర్యరాయ్ నటనకు గానూ ఈ అవార్డు వరించింది. కాగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసే సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే..

Balakrishna: బాలయ్య కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్యారాయ్.. వీడియో వైరల్.. అందాల తారపై ప్రశంసల వర్షం
Balakrishna, Aishwarya Rai
Follow us
Basha Shek

|

Updated on: Sep 28, 2024 | 7:15 PM

అబుదాబిలోని ఐలాండ్‌లో ఐఫా అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. సెప్టెంబర్ 27 న మొదలైన ఈ ఈవెంట్ ఆదివాం (సెప్టెంబర్ 29తో ముగియనుంది. ఈ సినిమా పండగ కోసం తెలుగు సినీ పరిశ్రమనుంచే కాదు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని ‘అవుట్ స్టాండింగ్ అఛీవ్‌మెంట్’ అవార్డుతో సత్కరించారు ఐఫా నిర్వాహకులు. అలాగే నందమూరి బాలకృష్ణకు ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును ప్రదానం చేశారు. అలాగే బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ తమిళంలో ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో ఐశ్వర్యరాయ్ నటనకు గానూ ఈ అవార్డు వరించింది. కాగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసే సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. ఈ అవార్డును బాలకృష్ణ తన చేతులమీదుగా ఐశ్వర్య కి ప్రదానం చేయాలని ఐఫా నిర్వాహకులు కోరారు. దీంతో అవార్డు అందుకునేందుకు స్టేజీమీదకు వచ్చిన ఐశ్వర్య అవార్డు తీసుకోవడానికి ముందు బాలయ్య కాళ్లకు నమస్కరించింది. ప్రపంచం మెచ్చిన స్టార్ హీరోయిన్ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాతే బాలయ్య చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఐష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్లోబల్ నటిగా ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా బాలీవుడ్ టాప్ నటీమణుల్లో ఒకరైన ఐశ్వర్యరాయ్ గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితం తో వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ లు త్వరలో విడాకులు తీసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అటు ఐష్ కానీ, అభిషేక్ కానీ స్పందించడం లేదు. మరోవైపు ప్రతిష్ఠాత్మక ఐఫా అవార్డ్స్ 2024 కోసం ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి అబుదాబి వచ్చింది. కొన్ని రోజుల క్రితమే దుబాయ్ లో జరిగిన సైమా వేడుకలకు కూడా కూతురితో కలిసి హాజరైంది ఐశ్వర్యా రాయ్. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.