Fish Venkat: మొన్న విశ్వక్ సేన్.. ఇప్పుడు మరొకరు.. ఫిష్ వెంకట్‌కు టాలీవుడ్ యంగ్ హీరో ఆర్థిక సాయం
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమను ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు, కామెడీ విలన్ ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఫిష్ వెంకట్ మాములు మనిషి కావాలంటే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం రూ.50 లక్షలు అవసరమవుతాయంటున్నారు. దీంతో వెంకట్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ వద్ద అంత డబ్బు లేదంటూ, దాతలు ఆదుకోవాలంటూ చేతులెత్తి మొక్కుతున్నారు. ఈ క్రమంలో ఫిష్ వెంకట్ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న హీరో విశ్వక్ సేన్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఇప్పుడు మరో హీరో ముందుకొచ్చాడు. వెంకట్ దీన స్థితి చూసి చలించిపోయిన జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని నటుడికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఈ క్రమంలో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో, ఆయన స్థాపించిన సేవా సంస్థ 100 Dreams Foundation ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. వెంకట్ కూతురు స్రవంతికి ఆ డబ్బు అందించాడు.
. ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ.. అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్నదే 100 Dreams Foundation సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితాన్నే మార్చేస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు కృష్ణను అభినందిస్తున్నారు. మరికొంత మంది ముందుకు వచ్చి ఫిష్ వెంకట్ ను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఫిష్ వెంకట్ కుమార్తెకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేస్తోన్న కృష్ణ మానినేని

Krishna Manineni
కాగా నిన్నటివరకు బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు ఫిష్ వెంకట్. అయితే ఆయన పరిస్థితి బాగు పడకపోవడంతో కుటుంబ సభ్యులు నటుడిని వేరొక ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ గ్యాంగ్..
Actor #Vishwaksen has donated Rs.2 Lakhs for the operation of #FishVenkat.
Their family along with Pawan Kalyan movie Gabbar Singh gang, thanked him for the Gesture 🙌❣️@VishwakSenActor #VishwakSenfans pic.twitter.com/MwboUDOkhP
— Yeshwant rocks9 (@Yeshwantrocks9) July 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








