Vijay Deverakonda- Rashmika: మొన్న విజయ్.. నేడు రష్మిక.. ఎంగేజ్మెంట్‌ రింగ్స్‌తో లవ్ బర్డ్స్.. వీడియో ఇదిగో

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 03న వీరి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయ్యిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు విజయ్- రష్మిక.

Vijay Deverakonda- Rashmika: మొన్న విజయ్.. నేడు రష్మిక.. ఎంగేజ్మెంట్‌ రింగ్స్‌తో లవ్ బర్డ్స్.. వీడియో ఇదిగో
Vijay Deverakonda, Rashmika Mandanna

Updated on: Oct 11, 2025 | 1:40 PM

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాలు పెళ్లిపీటలెక్కనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. ఈనెల 03న విజయ్ దేవరకొండ ఇంట్లో వీరి నిశ్చితార్థం సీక్రెట్ గా జరిగిందని వార్తలు గుప్పుమంటున్నాయి. వచ్చే ఏడాది పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని కూడా చెబుతున్నారు. అయితే తమ ఎంగేజ్మెంట్, పెళ్లి విషయాలపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ వారి కుటుంబ సభ్యులెవరూ స్పందించడం లేదు. పైగా ఎవరి సినిమా పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది రష్మిక. అందులో ఆమె తన పెట్ డాగ్ తో ఆడుకుంటూ కనిపించింది. అందులో రష్మిక చేతికి ఉన్న ఉంగరం బాగా హైలెట్ అయ్యింది. ఆ డైమండ్ రింగ్, ఎంగేజ్మెంట్ రింగేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మొన్న విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి రింగ్ తోనే కనిపించారు. ఎంగేజ్మెంట్ తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించడానికి పుట్ట పర్తి వెళ్లాడు విజయ్. అక్కడ ఈ హీరోకు ఆశ్రమ అధికారులు బొకేలు ఇచ్చి వీరికి ఆహ్వానం పలికారు. ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. అందులో విజయ్ చేతికి ఒక ఉంగరం కూడా కనిపించింది. దీంతో అది ఎంగేజ్మెంట్ రింగేనని కన్ఫామ్ చేశారు. ఇప్పుడు రష్మిక కూడా అలాంటి రింగ్ తోనే కనిపించేసరికి వీరికి అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ అయిపోయినట్టేనని నిర్ధారణకు వస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి సిల్వర్ స్క్రీన్ పై..

విజయ్ దేవరకొండ- రష్మికలు గీత గోవిందం సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తోంది. దీని తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలోనూ ఈ జంట కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట వెండితెరపై కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమాలో రష్మికనే కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

రింగ్ తో రష్మిక మందన్నా.. వీడియో ఇదిగో..

 

కొత్త సినిమా స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.