Rajnikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్లు.. వైరలవుతోన్న ఫొటోస్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో చాలామంది క్రికెటర్లు కూడా ఉన్నారు. తాజాగా కొందరు టీమిండియా క్రికెటర్లు రజనీని కలిశారు.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో చాలామంది క్రికెటర్లు కూడా ఉన్నారు. తాజాగా కొందరు టీమిండియా క్రికెటర్లు రజనీని కలిశారు. కుల్దీప్‌యాదవ్, వాషింగ్టన్ సుందర్ తదితరులు ముంబైలోని సూపర్ స్టార్ ఇంటికి వెళ్లారు. రజనీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాతో మొదటి వన్డే గెల్చిన తర్వాత అనంతరం వీరూ రజనీ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్పిన్నర్ కుల్దీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే శుక్రవారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రజనీ స్టేడియానికి వచ్చారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన సతీమణి లతా రజనీకాంత్‌తో విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.
కాగా మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్. . 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. భారత్ విజయంలో కేఎల్ రాహుల్(75), రవీంద్ర జడేజాలు కీలక పాత్ర పోషించారు. కాగా ఆదివారం (మార్చి 18) విశాఖపట్నం వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే రెండు జట్లు వైజాగ్ చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం విశాఖలో వర్షం దంచికొడుతోంది. దీంతో ఈ మ్యాచ్ జరుగుతుందా?లేదా?అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
View this post on Instagram
#Jailer #Rajinikanth #Thalaivar #SuperstarRajinikanth pic.twitter.com/copkWeZm79
— RajiniThangarasu ???? (@GokulsaranPT) March 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..