Jabardasth Pavithra: అనుపమకు జరిగినట్లే పవిత్ర జీవితంలోనూ.. బ్రేకప్ స్టోరీ చెప్పిన జబర్దస్త్ నటి.. వీడియో
ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన మాజీ ప్రియుడి చేతిలో నార్సిస్టిక్ అబ్యూస్ ఫేస్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక అనుపమ లైఫ్ లో జరిగినట్టే జబర్దస్త్ పవిత్ర జీవితంలోనూ ఇలాంటి ఒక చేదు అనుభవం ఉంది. ఈ క్రమంలో తన బ్రేకప్ స్టోరీ గురించి చెబుతూ వీడియో రిలీజ్ చేసింది పవిత్ర.

జబర్దస్త్ పవిత్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టిక్ టాక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన ఆమె బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇందులో ఆమె వేసే కామెడీ పంచులు, ఎక్స్ ప్రెషన్స్ బుల్లితెర ఆడియెన్స్ కు బాగా వినోదాన్ని అందిస్తున్నాయి. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, సూపర్ క్వీన్స్ వంటి షోలతో పాటు పలు టీవీ సీరియల్స్ లోనూ చేస్తోంది పవిత్ర. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తోందీ లేడీ కమెడియన్. ఇదిలా ఉంటే ఆ మధ్యన తన ప్రియుడితో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకుంది పవిత్ర. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారో ఇప్పటివరకు బయట పెట్టలేదు. అయితే తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసిన పవిత్ర తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.
‘ఇది నా పాస్ట్ లవ్ స్టోరీ. దీని గురించి ఇంతకు ముందు ఎప్పుడూ నేను బహిరంగంగా మాట్లాడలేదు. ‘నేను ఆ వ్యక్తిని ప్రాణంగా ప్రేమించాను. ఆ బంధానికి సర్వస్వం అప్పగించాను. కానీ, నెమ్మదిగా ఆ బంధమే నాకు ఊపిరాడకుండా చేసింది. గొడవలు, అవమానాలు, అదుపు, చివరికి వేధింపులు కూడా ఉండేవి. ప్రతీదీ నా తప్పే అని నమ్మడం మొదలుపెట్టాను. అది వేధింపులు అని కూడా నేను గ్రహించలేకపోయాను. దాన్ని నార్సిసిస్టిక్ అబ్యూస్ (స్వార్థపూరిత వేధింపు) అంటారో లేదో కూడా నాకు తెలియదు. అయితే అతన్ని గాఢంగా ప్రేమించినందున ఎప్పటికైనా పరిస్థితులు మారుతాయని చాలా రోజుల పాటు ఆశతో ఎదురుచూశాను. కానీ నిరాశే ఎదురైంది. అప్పుడు నాకు అర్థమైంది. ‘నువ్వు లేకపోతే నేను ఉండలేను – నువ్వు లేకపోతే బాగుండు’ నేను ఎంతగా బాధపడుతున్నానో అప్పుడే నాకు అర్థమైంది. నార్సిసిస్టిక్ అబ్యూస్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది. చివరగా, నేను నన్నే ఎంచుకున్నాను. ఆ బంధం నుంచి బయటకు వచ్చేశాను’ అని పోస్ట్ పెట్టింది పవిత్ర.
ఈ పోస్ట్ ను పంచుకుంటూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది పవిత్ర.. ‘ నేను సానుభూతి కోసం ఇది చెప్పుకోవడం లేదు. వేరొకరు మా పరిస్థితిని గుర్తించాలనే ఉద్దేశంతో పంచుకుంటున్నాను. ఎవరైనా మిమ్మల్ని నిరంతరం బాధిస్తూ, నియంత్రిస్తూ, లేదా పనికిరాని వారిగా భావించేలా చేస్తే దాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ప్రేమ మీ మనశ్శాంతిని, ఆత్మగౌరవాన్ని ఎన్నడూ నాశనం చేయకూడదు. మనం ఒకరిని ఎంతగా ప్రేమించినా, మనల్ని మనం ఎన్నడూ కోల్పోకూడదు’ అని పేర్కొంద పవిత్ర. ప్రస్తుతం ఈ జబర్దస్ట్ నటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జబర్దస్త్ పవిత్ర షేర్ చేసిన వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




