AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో ‘శ్రీనివాస మంగాపురం’.. మహేష్ అన్న కుమారుడి సినిమా ఎక్కడ చూడొచ్చంటే?

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో 'శ్రీనివాస మంగాపురం'.. మహేష్ అన్న కుమారుడి సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
Srinivasa Mangapuram Movie
Basha Shek
|

Updated on: Aug 19, 2026 | 6:16 PM

Share

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఘట్టమనేని జయకృష్ణ. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన అతను ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. రోటీన్ స్టోరీ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అనుకున్న కలెక్షన్లు రావడం లేదు. అయితే మాస్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే థియేటర్లలో రిలీజైన 20 రోజులకే శ్రీనివాస మంగాపురం సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20 అంటే రేపటి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని నిర్మించగా, ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, అజయ్, శామ్, నరేష్, బ్రహ్మాజీ, మహేంద్రన్, వాసుకీ ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. శ్రీనివాస మంగాపురం సినిమా కథ విషయానికి వస్తే.. తిరుపతి నేపథ్యంలో ప్రేమ, పగ, ప్రతీకారాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ మూవీపై ఒక లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో శ్రీనివాస మంగాపురం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us