AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: కియారా అద్వానీ కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్.. జోడీ అద్దిరిపోయింది

'రంగస్థలం' వంటి కల్ట్ క్టాసిక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. RC 17 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

Ram Charan: కియారా అద్వానీ కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్.. జోడీ అద్దిరిపోయింది
Ram Charan, Sukumar
Basha Shek
|

Updated on: Aug 19, 2026 | 6:35 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ‘పెద్ది’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. థియేటర్లలో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. భారీ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చేతికి సర్జరీ చేయించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన తర్వాతి సినిమా కోసం కూడా రెట్టింపు ఉత్సాహంతో రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోతున్న RC 17 ప్రాజెక్టు స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు చరణ్. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆర్ సీ 17లో మొదట కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. చాలా రోజుల క్రితమే ఈ బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గతంలో రామ్‌ చరణ్‌, కియారా కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ‘వినయ విధేయ రామ’, ‘గేమ్‌ ఛేంజర్‌’ ల్లో వీరు హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో సుక్కూ సినిమాలో కియారాను హీరోయిన్ గా తీసుకున్నారని తెలియగానే మెగాభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌ డేట్‌ వచ్చింది.

ఆర్ సీ 17 కియారా స్థానంలో మరో హీరోయిన్‌ని పరిశీలిస్తోందట చిత్ర బృందం. ప్రస్తుతం ఈ రేసులో ధురంధర్ సినిమాల హీరోయిన్ సారా అర్జున్ పేరు మొదట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్, పాపులారిటీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో సారానే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. ఇక వేళ ఇదే నిజమైతే మెగాభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సారా అర్జున్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sara Arjun (@saraarjunn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒకప్పుడు షాపులో టీలు అందించింది..ఇప్పుడేమో టాలీవుడ్ హీరోయిన్‌గా..
ఒకప్పుడు షాపులో టీలు అందించింది..ఇప్పుడేమో టాలీవుడ్ హీరోయిన్‌గా..
ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఎక్కువగా గాసిప్ చేస్తారట..!
ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఎక్కువగా గాసిప్ చేస్తారట..!
రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్రం స్కీమ్..
రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్రం స్కీమ్..
వైభవ్ సూర్యవంశీ ఔట్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11
వైభవ్ సూర్యవంశీ ఔట్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11
ఇలా చేస్తే టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉంటాయ్..
ఇలా చేస్తే టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉంటాయ్..
గుంటూరు కోడి వేపుడు అంటే.. ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తినాల్సిందే!
గుంటూరు కోడి వేపుడు అంటే.. ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తినాల్సిందే!
అరెరే కొబ్బరి పీచుతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
అరెరే కొబ్బరి పీచుతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
ఉచ్ఛ స్థితిలోకి చంద్రుడు.. వారి మనసులో కోరికలు నెరవేరడం పక్కా..!
ఉచ్ఛ స్థితిలోకి చంద్రుడు.. వారి మనసులో కోరికలు నెరవేరడం పక్కా..!
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని పూర్తి చేయడం తప్పనిసరి
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని పూర్తి చేయడం తప్పనిసరి
నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన
నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన