AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వివాదంలో ట్విస్ట్.. భార్య మరో వీడియో వైరల్..

ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు డ్యాన్సర్ ఈశ్వర్ సాయి. ఇటీవల అతడు చేసిన ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అతడి వ్యక్తిగత జీవితం మాత్రం వివాదంగా మారింది. తన తోటి డ్యాన్సర్ తో కలిసి తన భర్యకు అడ్డంగా దొరికిపోయిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వివాదంలో ట్విస్ట్.. భార్య మరో వీడియో వైరల్..
Eshwar Sai
Rajitha Chanti
|

Updated on: Aug 20, 2026 | 4:24 PM

Share

బాసింగ బలాలు సాంగ్ ఫేమ్ ఈశ్వర సాయి. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియా ప్రపంచంలో తెగ మారుమోగుతుంది. నిన్నటి వరకు అచ్చమైన పల్లె పాటలతో పాపులర్ అయిన ఈశ్వర్ సాయి.. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ కారణంగా చిక్కుల్లో పడ్డాడు. పెళ్లై, ఒక బిడ్డ ఉన్న అతడు.. తన తోటి ఫోక్ డ్యాన్సర్ తో గదిలో ఉండగా తన భార్యకు అడ్డంగా దొరిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వివాదంపై స్పందించిన ఈశ్వర్ సాయి భార్య తాజాగా మీడియా ముందు సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త మంచోడే కానీ ఆ అమ్మాయే తన భర్త వెంటపడిందని చెప్పుకొచ్చింది.

“మాకు పెళ్లై ఏడేళ్లు అవుతుంది. నా భర్త చాలా మంచివాడు. ఆయనకు కనీసం మందు తాగే అలవాటు కూడా లేదు. కానీ ఆ అమ్మాయే కావాలని ఆయన వెంటపడి, లొంగదీసుకుంది” అని ఆరోపించారు. గతంలో ఆ యువతికి బ్రేకప్ అయినప్పుడు తానే దగ్గరుండి ఓదార్చానని, రోజూ తన కళ్ల ముందే ఉండే ఆ అమ్మాయిని మంచిదే అనుకున్నానని శరణ్య పేర్కొన్నారు. అయితే వారి మొబైల్ చాట్స్ , మెసేజ్‌లు చూసిన తర్వాతే అసలు విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఈ మోసాన్ని తట్టుకోలేక ఒక దశలో తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించినట్లు తెలిపారు.

తన భర్త మంచోడే అంటూ తన భర్తను సమర్థిస్తూనే, ఆ యువతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శరణ్య, ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులను జానపద కళారంగంలోకి రానివ్వకూడదని పరిశ్రమ పెద్దలను డిమాండ్ చేశారు. ‘ప్రమీల’, ‘రాతిరి రాతిరి’ వంటి ప్రముఖ జానపద పాటల్లో కలిసి నటించిన ఈ జోడీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, జానపద కళాకారుల వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

ఈశ్వర్ సాయి భార్య..

https://x.com/TeluguScribe/status/2089958735347433789

 ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

Follow Us