క్యాస్టింగ్ కౌచ్ పై అదితిరావు హైదరీ కీలక కామెంట్స్..
క్యాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్ అదితిరావు హైదరీ కీలక కామెంట్స్ చేసింది. తాను కెరీర్లో ఇలాంటి అనుభవాలు చాలా ఎదుర్కున్నట్లు వివరించింది. అయితే తెలివిగా వ్యవహరించి ఆ ప్రమాదాల బారి నుంచి తప్పించుకున్నట్లు తెలిపింది.
క్యాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్ అదితిరావు హైదరీ కీలక కామెంట్స్ చేసింది. తాను కెరీర్లో ఇలాంటి అనుభవాలు చాలా ఎదుర్కున్నట్లు వివరించింది. అయితే తెలివిగా వ్యవహరించి ఆ ప్రమాదాల బారి నుంచి తప్పించుకున్నట్లు తెలిపింది. తాజాగా అదితి నటించిన మలయాళ మూవీ ‘సుఫియుమ్ సుజాతయుమ్’ అమెజాన్లో రిలీజైంది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ‘బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మీ ఓపినియన్ ఏమిటి?” అని అడగ్గా ఈ ఆన్సర్ చెప్పింది. దీంతో పాటు డామినేషన్, బెదిరింపుల సంస్కృతి కూడా ఉందని తెలిపింది హైదరీ. వీటన్నింటినీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా పారద్రోలాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
” ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిఒక్కరికీ ఇలాంటి అనుభవాలు, బెదిరింపులు ఎదురౌతుంటాయి. కొంతమంది అందులోనుంచి తెలివిగా తప్పించుకుంటారు. మరికొంతమంది అమాయకులు ఆ సమస్యల ఊబిలో చిక్కుకుంటారు. నేను లక్కీగా బయటపడగలిగాను” అని అదితిరావు హైదరీ పేర్కొన్నారు.
ముఖ్యంగా కొంతమంది నటీమణుల్ని వారి చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారని.. ఆ సమయంలో వారు చెప్పినట్లు వినకపోతే బెదిరింపులకు పాల్పడతారని చెప్పింది ఈ భామ. అవకాశాలు రాకుండా కూడా చేయగలరని తెలిపింది. తాను అలా ఉన్నందుకు సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది.