యానిమేషన్ సినిమాల వైపు మళ్లిన రానా మనసు…!
రానా దగ్గుబాటి..తెలుగు సినిమా పరిశ్రమలో ఈయన రూటే సెపరేట్. కేవలం హీరో అనే స్టార్ స్టేటస్ మధ్య ఇరుక్కోకుండా..నటుడిగా తనని తాను ఆవిష్కరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
రానా దగ్గుబాటి..తెలుగు సినిమా పరిశ్రమలో ఈయన రూటే సెపరేట్. కేవలం హీరో అనే స్టార్ స్టేటస్ మధ్య ఇరుక్కోకుండా..నటుడిగా తనని తాను ఆవిష్కరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పాత్ర నచ్చితే చాలు..ఏ ఇండస్ట్రీకైనా వెళ్లిపోతారు. అంతేకాదు నిర్మాతగా కూడా ఆయన అభిరుచి విభిన్నంగా ఉంటుంది. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది రానానే. ఇటీవలే ఓటీటీలో రిలీజైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ కూడా రానా నిర్మాణంలో వచ్చిందే. కాగా రానా ఇకపై చిత్ర నిర్మాణంపై పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు నిర్మించడమే కాకుండా చిన్న పిల్లల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు తీయాలని వ్యూహాలు రచిస్తున్నారు భల్లాల దేవ. రాబోయే రోజుల్లో యానిమేషన్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నట్లు రానా ఇటీవల తెలిపారు. ప్రజంట్ రానా ‘అరణ్య’ మూవీలో విడుదలకు రెడీగా ఉంది. హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళంలో ‘కడన్’ పేరుతో రానుందీ సినిమా. జంతువుల మనుగడ కోసం పోరాడే అడవి తెగకు చెందిన వ్యక్తిగా రానా విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. ఏప్రిల్ 2వ తేదీన విడుదల కావాల్సి ఉన్నా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.