AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెర్రీకి పోటీగా మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో నిర్మాత‌..

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే ఆరుగురు హీరోలు, ఒక హీరోయిన్ తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. కాగా వీరిలో హీరోలే కాకుండా నిర్మాత‌లు కూడా ఉన్నారు. చిరంజీవి స‌తీమ‌ణి కొణిదెల సురేఖ‌, కొడుకు రామ్ చ‌ర‌ణ్, మెగా బ్ర‌దర్స్ నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న...

చెర్రీకి పోటీగా మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో నిర్మాత‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 08, 2020 | 5:18 PM

Share

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే ఆరుగురు హీరోలు, ఒక హీరోయిన్ తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. కాగా వీరిలో హీరోలే కాకుండా నిర్మాత‌లు కూడా ఉన్నారు. చిరంజీవి స‌తీమ‌ణి కొణిదెల సురేఖ‌, కొడుకు రామ్ చ‌ర‌ణ్, మెగా బ్ర‌దర్స్ నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మ‌రో ప్రొడ్యూస‌ర్ రాబోతున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత రంగంలోకి దిగింది. ఇప్ప‌టివ‌ర‌కూ చిరు, చెర్రీ సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ఉన్న సుష్మిత ఇప్పుడు నిర్మాణ రంగంలో అడుగుపెట్ట‌బోతుంది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే సంస్థ‌ను స్థాపించి మంగ‌ళ‌వారం ఆమె వెబ్‌సిరీస్‌కు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా త‌న కుటుంబంలోని హీరోల‌తో కూడా సినిమాలు చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట సుష్మిత‌. మ‌రి చూడ‌బోతుంటే నిర్మాణ రంగంలో మెగా ఫ్యామిలీలోనే గ‌ట్టి పోటీ క‌న‌బ‌డేలా ఉంది. కాగా సుష్మిత నిర్మించే వెబ్ సిరీస్‌లు త‌న మేన‌మామ అల్లు అర‌వింద్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Read More: 

మ‌రోసారి సుద్దాల అశోక్ తేజ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి