
ఆదిపురుష్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో వెయిట్ చేస్తున్న సినిమా ఇది. ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. టీజర్‍తో విమర్శలను ఎదుర్కొన్న చిత్రయూనిట్.. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసి అమాంతం హైప్ పెంచేసింది. విజువల్ ఎఫెక్ట్.. డైలాగ్స్.. రాముడిగా ప్రభాస్ లుక్స్ అభిమానులను కట్టిపడేశాయి. డైరెక్టర్ ఓంరౌత్.. ప్రభాస్ కాంబోలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. త్వరలోనే సెకండ్ సాంగ్ రాబోతుంది. ఇక మరోవైపు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లుగా భారీ ఎత్తున జరగుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న హైప్ కారణంగా ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ఓ రేంజ్లో పోటీ ఏర్పడింది. ఇక తెలుగులో రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.170 కోట్లకు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. నైజాం ఏరియా వరకే రూ. 80 కోట్ల వరకు డిమాండ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
తానాజీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఓంరౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.