Vaishnavi Chaitanya : బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య అడుగులు ఎటువైపు..
సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోగా ఆనంద్ దేవరకొండ నటించాడు. అలాగే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య పేరు మారుమ్రోగింది. ఇప్పుడు ఎక్కడ చూసిన వైష్ణవి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బేబీ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో వైష్ణవికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో బేబీ సినిమా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోగా ఆనంద్ దేవరకొండ నటించాడు. అలాగే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య పేరు మారుమ్రోగింది. ఇప్పుడు ఎక్కడ చూసిన వైష్ణవి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బేబీ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో వైష్ణవికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి ఓ భారీ ఆఫర్ కూడా వచ్చిందని తెలుస్తోంది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో నటించే ఛాన్స్ అందుకుందట వైష్ణవి.
రామ్ పోతినేని హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే వైష్ణవి కు ఈ సినిమా తర్వాత ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. వైష్ణవి ఎలాంటి కథలను ఎంచుకుంటుంది అంటూ చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇప్పుడు వైష్ణవి ముందు రెండు దారులు ఉన్నాయి. హీరోయిన్ గా రాణించాలంటే ఈ రెండు దారుల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. వాటిలో వచ్చిన సినిమాలను వరుసగా చేసుకుంటూ పోవడం లేదా.. కథల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ.. ఆచితూచి అడుగులు వేయాలి. మంచి సినిమా అవకాశాలు వచ్చే వరకు ఎదురుచూడాలి . మరి ఈ రెండు దారుల్లో వైష్ణవి ఏ దారిని ఎంచుకుంటుందో చూడాలి.
బేబీ సినిమాలో వైష్ణవి నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు..
View this post on Instagram
వైష్ణవి చైతన్య తన అందంతో ఆకట్టుకుంది ..
View this post on Instagram
వైష్ణవికి క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి..
View this post on Instagram
వైష్ణవి చైతన్య ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




