AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: ఆ సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న అందాల తాప్సీ

కోవిడ్‌కు ముందు బద్ల, మిషన్ మంగల్‌, తప్పడ్ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించారు తాప్సీ. కరోనా టైమ్‌లో థియేటర్లకు బ్రేక్ పడటంతో హసీన్‌ దిల్రుబా సినిమాతో డిజటల్‌ ఆడియన్స్‌ ముందుకు వచ్చి సక్సెస్ సాధించారు.

Taapsee Pannu: ఆ సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న అందాల తాప్సీ
Taapsee Pannu
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2022 | 8:06 PM

Share

కోవిడ్‌కు ముందు వరకు మంచి ఫామ్‌లో కనిపించిన తాప్సీ.. ఆఫ్టర్ కోవిడ్ కెరీర్‌ విషయంలో తడబడుతున్నారు. ఈ బ్యూటీ నటించిన సినిమాల చాలా వరకు ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఒకటి రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినా అవి పెద్దగా వర్కవుట్ కావటం లేదు. దీంతో తాప్సీ కెరీర్‌ క్లైమాక్స్‌కు వచ్చినట్టేనా అన్న డిస్కషన్ మొదలైంది. కోవిడ్‌కు ముందు బద్ల, మిషన్ మంగల్‌, తప్పడ్ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించారు తాప్సీ. కరోనా టైమ్‌లో థియేటర్లకు బ్రేక్ పడటంతో హసీన్‌ దిల్రుబా సినిమాతో డిజటల్‌ ఆడియన్స్‌ ముందుకు వచ్చి సక్సెస్ సాధించారు. ఓటీటీ రిలీజ్ అయినా.. ఈ సినిమాకు యునానిమస్‌ పాజిటివ్‌ టాక్ రావటంతో అమ్మడి కెరీర్‌ ఫుల్‌ జోష్‌లో కనిపించింది.

అదే జోరులో రష్మిరాకెట్‌, లూప్‌ లపెట్టా లాంటి డిఫరెంట్ సినిమాలు చేశారు తాప్సీ. కానీ ఆ సినిమాలేవి అనుకన్న స్థాయిలో మెప్పించలేకపోవటంతో తాప్సీ కెరీర్‌ గాడి తప్పింది. ఆ తరువాత మిషన్ ఇంపాజిబుల్‌, శభాస్‌ మిథు లాంటి సినిమాలు థియేటర్లలోనే రిలీజ్ అయినా… అవి కూడా సక్సెస్ సాధించలేకపోయాయి. రీసెంట్‌గా తడ్కా సినిమాతో మరోసారి డిజిటల్ ఆడియన్స్‌ ముందుకు వచ్చారు తాప్సీ పన్ను. ఈ సినిమా కూడా అమ్మడి కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయింది. దీంతో ఆశలన్ని అప్‌కమింగ్ మూవీ బ్లర్ మీదే పెట్టుకున్నారు ఈ ఢిల్లీ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

తాప్సీ కెరీర్‌కు బ్లర్ సక్సెస్‌ చాలా ఇంపార్టెంట్‌. ఈ సినిమాలో కళ్లు సరిగా కనిపించని అమ్మాయిగా చాలెంజింగ్ రోల్ ప్లే చేస్తున్నారు తాప్సీ. అంతేకాదు ఈ సినిమాతో తాప్సీ నిర్మాతగానూ మారారు. ఈ సినిమాను కూడా డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు తాప్సీ. థియేటర్‌లో రిలీజ్‌ చేసి రిస్క్ చేయటం కన్నా.. ఓటీటీలో రిలీజ్ చేయటం సేఫ్‌ అని ఫీల్ అవుతున్నారు. మరి ఈ నిర్ణయం తాప్సీ కెరీర్‌ను గాడిలో పెడుతుందా..? చూడాలి.

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి