AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయటకనిపిస్తే కొడతాం అని మెసేజులు చేస్తున్నారు.. ఇరుముడి నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇరుముడి చిత్రంలో తన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ధనలక్ష్మిపై ప్రేక్షకులకు కలిగిన కోపాన్ని నటి స్వాసిక విజయ్ పంచుకున్నారు. తన పాత్రను సమర్థవంతంగా పోషించానని, ప్రేక్షకుల స్పందన పట్ల తాను గర్వంగా ఉన్నానని ఆమె తెలిపారు. దర్శకుడు శివ నిర్వాణగైడెన్స్ , చిత్రం సాధించిన ఆర్గానిక్ బ్లాక్‌బస్టర్ విజయం గురించి వివరించారు.

బయటకనిపిస్తే కొడతాం అని మెసేజులు చేస్తున్నారు.. ఇరుముడి నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Swasika Vijay
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2026 | 2:15 PM

Share

రవితేజ, శివ నిర్వాణల ఇరుముడి చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో ఒకటైన ధనలక్ష్మిపై ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పాత్రను పోషించిన నటి స్వాసిక విజయ్, తన నటనకు లభించిన ఈ అనూహ్య స్పందన పట్ల ఆశ్చర్యం, అలాగే సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నా పాత్రను చూసిన తర్వాత మీరు చాలా చెడ్డ పాత్ర చేశారు, మిమ్మల్ని కొట్టాలనిపిస్తోంది అంటూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఎన్నోమెసేజ్ లు, మీమ్స్ వస్తున్నాయి. ఇది ఒక నటులకు దొరికే గొప్ప ప్రశంస. నా పాత్రకు నేను న్యాయం చేశానని భావిస్తున్నాను” అని స్వాసిక తెలిపింది.

ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే

సినిమాలో ఆమె పోషించిన ధనలక్ష్మి పాత్రకు తీవ్రమైన నెగిటివ్ షేడ్స్ ఉండడంతో, ప్రేక్షకులు దానిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనకు కూడా సినిమా చూసినప్పుడు కూడా తన పాత్రపై కోపం వచ్చిందని ఆమె చెప్పారు. “ధనలక్ష్మి అనే పేరు ఎంతో మధురమైనది, పవిత్రమైనది. కానీ నా పాత్ర ఒక బ్యాడ్ వుమన్. సమాజంలో ఇలాంటి చెడ్డ టీచర్లు ఉన్నారని దర్శకుడు చూపించాలనుకున్నారు” అని స్వాసిక తెలిపింది.

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

ఈ  పాత్రను పోషించడంలో దర్శకుడు శివ నిర్వాణ అందించిన గైడెన్స్ ను స్వాసిక ప్రశంసించింది. “ముఖ్యంగా కంటి కదలికలు, సూక్ష్మమైన హావభావాలు ఎలా ఇవ్వాలో శివ సర్ నాకు నేర్పించారు. ఎక్కువ మెలోడ్రామా అవకుండా, పాత్ర స్వభావాన్ని కళ్ళతోనే పలికించడం ఎలాగో ఆయన వివరించారు. ఈ ప్రయాణమంతా ఆయన నాకు చాలా గైడెన్స్ అందించారు” అని స్వాసిక తెలిపింది రవితేజ వంటి సీనియర్ నటుడితో కలిసి నటించడం కూడా ఎంతో సౌకర్యంగా ఉందని, ఆయన కంఫర్ట్ ఇచ్చారని స్వాసిక చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us