AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క రాత్రిలోనే రూ. 54 కోట్ల చోరీ.. 600 ఏళ్ల నాటి చరిత్రలోనే అతి పెద్ద వైన్ చోరీ వైరల్!

ఇటలీ దేశంలో ఒక వింతైన, భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల చరిత్ర కలిగిన అత్యంత ప్రసిద్ధ వైన్ తయారీ సంస్థ వేర్‌హౌస్‌లోకి చొరబడిన దొంగలు, ఒక్క రాత్రిలోనే కోట్లాది రూపాయల విలువైన వైన్ సీసాలను ఎత్తుకెళ్లారు. ఈ చోరీ విలువ తెలిసి అధికారులు, పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఇటలీ చరిత్రలోనే ఇది అతిపెద్ద వైన్ చోరీగా భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక్క రాత్రిలోనే రూ. 54 కోట్ల చోరీ.. 600 ఏళ్ల నాటి చరిత్రలోనే అతి పెద్ద వైన్ చోరీ వైరల్!
Italy Wine Heist
Jyothi Gadda
|

Updated on: Oct 10, 2026 | 1:24 PM

Share

ఇటలీలోని టస్కానీలో 600 ఏళ్ల నాటి ప్రసిద్ధ మార్కెసి యాంటినోరి వైనరీ వేర్‌హౌస్‌లో దొంగలు సంచలన దోపిడీకి పాల్పడ్డారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ నుంచి ఏకంగా 30 వేల ప్రీమియం రెడ్ వైన్ సీసాలను దుండగులు అపహరించారు. ఇటలీలోని టస్కానీ ప్రాంతంలో ఉన్న మార్కెసి యాంటినోరి కంపెనీకి 1385వ సంవత్సరం నుంచి వైన్ తయారు చేసే గొప్ప చరిత్ర ఉంది. సుమారు 600 ఏళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బ్రాండ్, అత్యంత నాణ్యమైన, ఖరీదైన రెడ్ వైన్‌లకు ప్రసిద్ధి చెందింది.

కొర్టోనాలోని కంపెనీకి చెందిన ప్రధాన వేర్‌హౌస్‌లో ఈ ఘటన జరిగింది. సిసిటివీ దృశ్యాల ప్రకారం, ముఖాలకు మాస్క్‌లు ధరించిన ఏడుగురు దొంగలు రాత్రి సమయంలో వేర్‌హౌస్‌లోకి ప్రవేశించారు. వారు మొదట సెక్యూరిటీ అలారం సిస్టమ్‌ను డిసేబుల్ చేశారు. ఆ తర్వాత వివిధ దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచిన ప్రీమియం వైన్ బాక్సులను వెంట తెచ్చుకున్న రెండు పెద్ద ట్రక్కుల్లోకి లోడ్ చేసుకుని పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం ఉద్యోగులు విధులకు వచ్చినప్పుడు కానీ ఈ దోపిడీ విషయం వెలుగులోకి రాలేదు.

దొంగిలించిన వైన్ విలువ ఎంత?

ఈ దోపిడీలో మొత్తం 30,000 ప్రీమియం రెడ్ వైన్ బాటిళ్లు చోరీకి గురయ్యాయి. వీటి మార్కెట్ విలువ దాదాపు 5.5 మిలియన్ యూరోలు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 54.29 కోట్లు. టిగ్నానెల్లో, సోలైయా, గ్వాడో అల్ టాస్సో వంటి అత్యంత ఖరీదైన బ్రాండ్ల వైన్ సీసాలను మాత్రమే దొంగలు టార్గెట్ చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

కస్టమర్లకు అలర్ట్

ఇటలీ చరిత్రలోనే ఇది అతిపెద్ద వైన్ చోరీ అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనధికారిక వ్యక్తులు లేదా అనధికారిక ప్రదేశాల నుంచి తక్కువ ధరకే లభిస్తున్నాయని ఈ వైన్ బాటిళ్లను కొనుగోలు చేయవద్దని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లను హెచ్చరించింది. ప్రస్తుతం ఇటాలియన్ పోలీసులు సీసీటీవీ ఆధారాల సహాయంతో నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us