AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sobhita Dhulipala: ఏ భాషలో అయినా చేసేందుకు నేను రెడీ.. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల ఇంట్రస్టింగ్ కామెంట్స్..

తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని, బయటి నుంచి వచ్చేవాళ్లకే ఛాన్సులు ఇస్తారనే మాటను నేను నమ్మను అంటున్నారు హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.

Sobhita Dhulipala: ఏ భాషలో అయినా చేసేందుకు నేను రెడీ.. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Sobhita Dhulipala
Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 14, 2021 | 8:21 AM

Share

Sobhita Dhulipala: తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని, బయటి నుంచి వచ్చేవాళ్లకే ఛాన్సులు ఇస్తారనే మాటను నేను నమ్మను అంటున్నారు హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. తాజాగా ఆమె మాట్లాడుతూ..  తెలుగులో ఇతర భాషల హీరోయిన్లు వస్తున్న మాట నిజమే. కానీ తెలుగువాళ్లకు అవకాశాలు లేవని నేను చెప్పను. నాకు బయటకంటే ఇక్కడే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. నేను ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడి అమ్మాయిలు కూడా మనలాగే అనుకుంటారేమో అన్నారు. హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నటించిన కురుప్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను పుట్టి పెరిగింది సంప్రాదయమైన తెలుగు కుటుంబంలో అయినా, నా సినీ ప్రస్థానం మొదలైంది మాత్రం ముంబైలోనే. కాబట్టి నా జర్నీకి స్టార్టింగ్ పాయింట్ బాలీవుడ్ అని చెప్పొచ్చు. నా మనసులో ఎలాంటి బౌండరీలు లేవు. నేను ఏ భాషలో సినిమా చేయాలన్నా కథ బాగా నచ్చాలి. అంతేకానీ ఇది మన భాష కాదనే విషయాన్ని నేను పట్టించుకోను. సినిమాలో నా పాత్ర నన్ను ఇంప్రెస్ చేస్తే ఏ భాషలో అయినా చేసేందుకు నేను రెడీ. ‘కురుప్’లో నా పాత్ర నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది అన్నారు. నేను ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నా.. అందులో నా పాత్ర నిడివి గురించి పట్టించుకోను. నా పాత్రకు తగిన ప్రాధాన్యం ఉందా లేదా అనేదే చూస్తాను. అంటే కూరలో కరివేపాకుల కాకుండా ఉప్పులా ఉండాలి. కూర ఎంత చేసినా ఉప్పులేకపోతే టేస్ట్ ఉండదు కదా. అలా నా పాత్ర ప్రాముఖ్యతను బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను.నేను నా సినీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఇలాంటి సినిమాలే చేయాలి, అలాంటి పాత్రలు చేయకూడదని చాలా పర్టికులర్‌గా ఉండేదాన్ని. అయితే నేను సినిమా చేస్తున్న క్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నా. ఏ జోనర్ సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చేలా కథ ఉంటే అందులో నటించాలని అనుకున్నా. ఇప్పుడు అలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నా. ఇక నేను ఏ పాత్ర ఎంచుకున్నా స్క్రిప్ట్‌ను చాలా సార్లు చదువుతా. నా పాత్ర గురించి పూర్తిగా అర్థం చేసుకుని అందులో లీనమయ్యేలా హోం వర్క్ చేస్తా. ఈ సినిమాకు కూడా చాలా హోంవర్క్ చేశా. సినిమాలో నా పాత్ర చూస్తే నా హార్డ్ వర్క్ మీకు అర్థమై ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు శోభితా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!