AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya Saran: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట.. ఇంట్లో శ్రియా చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు.. పెళ్లి చీరలో అలా..

సోమవారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని రంగాల ప్రముఖుల హజరయ్యారు. దాదాపు 8వేల మంది ప్రముఖులు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనగా.. ఆ దివ్య రూపాన్ని టీవీల్లో లైవ్ అప్డేట్స్‏లో చూస్తూ చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుండగా.. దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లలో పూజలు నిర్వహించారు. శ్రీరాముడి ప్రతిమలకు ప్రత్యేక హారతులిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో సాయంత్రం ఐదు దీపాలు వెలిగించారు.

Shriya Saran: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట.. ఇంట్లో శ్రియా చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు.. పెళ్లి చీరలో అలా..
Shriya Saran
Rajitha Chanti
|

Updated on: Jan 23, 2024 | 6:57 PM

Share

దాదాపు 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సం ఘనంగా జరిగింది. కోట్లాది మంది శతాబ్దల కల ఎట్టకేలకు నేరవేరింది. బాలరాముడి రూపంలో శ్రీరాముడు తన జన్మస్థలం అయోధ్యలో కొలువుదీరాడు. సోమవారం (జనవరి 22న) జరిగిన ఆ వేడుకను చూసిన భక్తులు రామనామంతో పులకించిపోయారు. సోమవారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని రంగాల ప్రముఖుల హజరయ్యారు. దాదాపు 8వేల మంది ప్రముఖులు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనగా.. ఆ దివ్య రూపాన్ని టీవీల్లో లైవ్ అప్డేట్స్‏లో చూస్తూ చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుండగా.. దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లలో పూజలు నిర్వహించారు. శ్రీరాముడి ప్రతిమలకు ప్రత్యేక హారతులిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో సాయంత్రం ఐదు దీపాలు వెలిగించారు. అటు వేడుకలో పాల్గొనలేకపోయిన సినీ ప్రముఖులు సైతం తమ ఇళ్లలో శ్రీరాముడి ప్రత్యేక పూజను నిర్వహించారు. హీరోయిన్ శ్రియా సైతం ఇంట్లో రామ పూజ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుండగా.. ముంబైలోని తన నివాసంలో శ్రీరాముడిని పూజించింది శ్రియా. ఈ పూజలో తన పెళ్లి చీరను ధరించింది. ఈరోజు అంతా మయే అంటూ రాసుకోచ్చింది. శ్రియా మెజెంటా పింక్ కలర్ చీరపై సిల్వర్ వర్క్, గోల్డెన్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ధరించి సంప్రదాయ లుక్ లో కనిపించింది. “నిన్న పూర్తిగా మాయాజాలం జరిగింది. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన శుభదినం రోజున ఇంట్లో శ్రీరామ పూజా కోసం నేను నా పెళ్లి చీరను ధరించాను.” అంటూ రాసుకొచ్చింది శ్రియా. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో వైరలవుతుంది.

ఒకప్పుడు తెలుగులో వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియా.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు సహయ పాత్రలలో నటిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ కనిపిస్తుంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోనూ కనిపించింది శ్రియా. తెలుగు, హిందీ భాషలలో నటిస్తుంది శ్రియా. అలాగే అటు ఓటీటీలోనూ ఫుల్ బిజీగా ఉంటుంది. దాదాపు 24 ఏళ్లుగా సినీ పరిశ్రమలో చురుకుగా ఉంటూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది శ్రియా. 2018లో రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్ ను వివాహం చేసుకుంది శ్రియా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.