AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha’s Yashoda: శరవేగంగా సమంత ‘యశోద’ షూటింగ్.. సినిమా గ్రాండియ‌ర్‌గా ఉంటుందన్న నిర్మాత..

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'యశోద'. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Samantha's Yashoda: శరవేగంగా సమంత 'యశోద' షూటింగ్.. సినిమా గ్రాండియ‌ర్‌గా ఉంటుందన్న నిర్మాత..
Samantha
Rajeev Rayala
|

Updated on: Dec 25, 2021 | 6:09 PM

Share

Samantha’s Yashoda: సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా యశోద మూవీ మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్త‌యిన సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం.. ఈ నెల 6న `య‌శోద‌` చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టాం. 24తో ఫస్ట్ షెడ్యూల్ పూర్త‌యింది. సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులపై హైద‌రాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం అన్నారు.

అలాగే ప్ర‌ముఖ న‌టులు రావు రమేష్, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు. జనవరి 3న రెండో షెడ్యూల్ ప్రారంభించి 12 వరకూ చేస్తాం. మూడో షెడ్యూల్ జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ నిర్విరామంగా జరుగుతుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది అని తెలిపారు. ఇక దర్శకులు ఇద్దరూ కొత్తవాళ్లు అయినప్పటికీ… ఎక్స్ ట్రార్డిన‌రీగా, కాన్ఫిడెంట్‌గా తెర‌కెక్కిస్తున్నారు. కెమెరామెన్ సుకుమార్ కూడా అద్భుత‌మైన అవుట్‌పుట్‌ ఇస్తున్నారు. విజువ‌ల్‌గా, టెక్నిక‌ల్‌గా సినిమా చాలా గ్రాండియ‌ర్‌గా ఉంటుంది. ఖర్చు విషయంలో ఎక్క‌డా రాజీ పడటం లేదు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏమన్నారంటే..

హీరోగా మారనున్న కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరంటే…

Ghani: గని రిలీజ్ డేట్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ