హీరోగా మారనున్న కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరంటే…
కాంగ్రెస్ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులలో
కాంగ్రెస్ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులలో ఆయన ఒకరు. ఇప్పటివరకు నేరుగా ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన ఆ నాయకుడు ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత హీరోగా మారనున్నారు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో ఉండబోతున్నట్టుగా సమాచారం. ఫిబ్రవరిలో ఆయన నటించిన సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరనే కదా మీ సందేహం…
అతనే టీ కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్..ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సినీ హీరోగా మారనున్నారు. బొమ్మక్ మురళి అద్దంకి దయాకర్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అద్దంకితో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా కలిసి నటిస్తున్నారు. అద్దంకి భార్యగా ప్రముఖ సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు. మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు తెలిసింది.. అయితే ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నారని అద్దంకి తెలిపారు. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలు ఈ మూవీలో ఉంటాయని అద్దంకి దయాకర్ వివరించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.
Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు
Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..