AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: మహేష్ అతిథి మూవీ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన సాయి పల్లవి..

ప్రేమమ్ సినిమాతో పరిచయమైనా సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తుంది. సాయి పల్లవి కోసమే సినిమాలు చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు.

Sai Pallavi: మహేష్ అతిథి మూవీ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన సాయి పల్లవి..
Mahesh Babu, Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2024 | 5:01 PM

Share

సాయి పల్లవి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ ముద్దుగుమ్మ తన నటనతో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. రీసెంట్ గా అమరన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ప్రేమమ్ సినిమాతో పరిచయమైనా సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తుంది. సాయి పల్లవి కోసమే సినిమాలు చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. స్టార్ హీరో రేంజ్ లో ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఈ అమ్మడిని లేడీ పవర్ స్టార్ అని అభిమానులు పిలుస్తుంటారు.

ఇది కూడా చదవండి : ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఇక ఈ అమ్మడు ఇటీవల సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. రీసెంట్ గా శివకార్తికేయన్ తో కలిసి అమరన్ సినిమా చేసింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పల్లవి మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అలాగే తెలుగులో ఈ చిన్నది నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా మత్యకారుల నేపథ్యంలో ఉండనుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా

ఇదిలా ఉంటే సాయి పల్లవి డాన్స్ ఇరగదీస్తుందన్న విషయం తెలిసిందే. ఈ చిన్నది కెరీర్ స్టార్టింగ్ లో పలు డాన్స్ షోల్లోనూ పాటిస్పెట్ చేసింది. కాగా మహేష్ బాబు సాంగ్ కు సాయి పల్లవి డాన్స్ చేసిన వీడియో ప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు సాయి పల్లవి డ్యాన్సర్ గా పలు షోలు చేసింది. ఓ ప్రముఖ ఛానల్ లో నిర్వహించిన డాన్స్ షో ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సాంగ్ కు పర్ఫామ్ చేసింది. మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలోని రాత్రయినా నాకు ఓకే సాంగ్ కు క్రేజీ స్టెప్పులేసింది. ఈ సాంగ్ కు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే త్వరలోనే మహేష్ బాబు అతిథి మూవీ రీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాలకు రీ రిలీజ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోకిరి, మురారి సినిమాలు రీ రిలీజ్ లో నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు అతిథి సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియాట్ చేస్తుందో చూడాలి. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..