AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasthuri Shankar: నటి కస్తూరి శంకర్‌కు షాక్ ఇచ్చిన కోర్టు.. అరెస్ట్ తప్పదా..

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కస్తూరి పై పలు తెలుగు సంఘాలు పిర్యాదు చేశాయి. కాగా వారం క్రితం సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది , అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. దాంతో కస్తూరి అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.

Kasthuri Shankar: నటి కస్తూరి శంకర్‌కు షాక్ ఇచ్చిన కోర్టు.. అరెస్ట్ తప్పదా..
Kasthuri Shankar
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2024 | 3:58 PM

Share

నటి కస్తూరి వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. తెలుగు వారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంది. ఆమె పై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఆమె పై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ను ఆశ్రయించారు.  కాగా ముందస్తు బెయిల్ కోసం నటి కస్తూరి పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కస్తూరి పై పలు తెలుగు సంఘాలు పిర్యాదు చేశాయి. కాగా వారం క్రితం సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది , అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. దాంతో కస్తూరి అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు కస్తూరి. మంగళవారం కస్తూరి పిటిషన్ ను విచారించిన మదురై బెంచ్ కస్తూరి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు, తమిళులను వేరు చేసి ఎలా మాట్లాడతారని కోర్టు సీరియస్ అయ్యింది. దాంతో కస్తూరి కి ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ.. న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసింది.

ఇది కూడా చదవండి : ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి శంకర్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పుతున్న కొందరు అంటూ వారిని ఉద్దేశించి ఎప్పుడో దశాబ్దాల క్రితం రాణుల దగ్గర సేవలు చేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళనాడు చలామణి అవుతూ..  మాట్లాడుతున్నారని తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపాయి.

ఇది కూడా చదవండి :Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా

తమిళనాడులో ఉన్న తెలుగు వారు అంతఃపురంలో ఊడిగం చేసుకోవడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారా తెలుగువారు అంటే ఎంత చిన్నచూపు ఎందుకు అంటూ తెలుగు సంఘాలు నటి కస్తూరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు కూడా కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకొని కేసులు నమోదు చేశారు. ఇక నటి కస్తూరి అరెస్టు తప్పదు అని తెలిశాక ఆమె తమిళనాడు నుంచి వెళ్లిపోయారు. విచారణకు రావాలని సమన్లు అందజేసేందుకు పోలీసులు కస్తూరి ఇంటికి వెళ్ళగా అక్కడ ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచాఫ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నటి కస్తూరి పోలీసులు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు గుర్తించారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ను ఆశ్రయించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నాడు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నాడు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ