- Telugu News Photo Gallery Cinema photos Sivakarthikeyan and Sai pallavi Amaran Movie OTT Release Date 05 December 2024 Update here
Amaran OTT Date: అమరన్ ఓటిటి రిలీజ్ కు బ్రేక్.! కారణం అదేనా.?
ప్రజెంట్ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ విషయంలోనూ ఓటీటీలో ఒత్తిడి కనిపిస్తోంది. డిజిటల్ సంస్థలు చెప్పిన టైమ్‌కే సినిమాలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. రిలీజ్ తరువాత కూడా ఆ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావాలన్న విషయంలోనూ ఓటీటీ సంస్థల పెత్తనమే కనిపిస్తోంది. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేసింది ఓ లేటెస్ట్ బ్లాక్ బస్టర్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Updated on: Nov 14, 2024 | 3:16 PM

ప్రజెంట్ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ విషయంలోనూ ఓటీటీలో ఒత్తిడి కనిపిస్తోంది. డిజిటల్ సంస్థలు చెప్పిన టైమ్‌కే సినిమాలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి.

రిలీజ్ తరువాత కూడా ఆ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావాలన్న విషయంలోనూ ఓటీటీ సంస్థల పెత్తనమే కనిపిస్తోంది. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేసింది ఓ లేటెస్ట్ బ్లాక్ బస్టర్.

దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ అయి రెండు వారాలు దాటినా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. రిలీజ్‌కు ముందే జరిగిన అగ్రిమెంట్ ప్రకారం అమరన్ సినిమాను డిసెంబర్ మొదటి వారంలోనే డిజిటల్‌లో రిలీజ్ చేయాల్సి ఉంది.

కానీ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటం, ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్ వస్తుండటంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీలోనూ అమరన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అందుకే డిజిటల్ రిలీజ్‌ను మరో రెండు వారాల పాటు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే రీసెంట్ టైమ్స్‌లో చెప్పిన టైమ్ కన్నా ఆలస్యంగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న సినిమాగా అమరన్ నయా రికార్డ్ సెట్ చేస్తోంది.

బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించారు శివ కార్తికేయన్. ఆయన భార్యగా సాయి పల్లవి నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించారు.




