AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi Birthday: ఆమె ఆడితే నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.. వెండితెరపై చూపు తిప్పుకోనివ్వని అందాల మకరందం..

దక్షిణాది క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Sai Pallavi Birthday: ఆమె ఆడితే నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.. వెండితెరపై చూపు తిప్పుకోనివ్వని అందాల మకరందం..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: May 09, 2022 | 1:14 PM

Share

పురివిప్పిన నెమలి నాట్యం చేస్తున్నట్లుగా తన నృత్యంతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. సహజమైన నటనతో.. అచ్చమైన తెలుగింటి ఆడపిల్లగా తెలుగు ప్రేక్షకుల మనసులలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ న్యాచురల్ బ్యూటీ. సినిమాల్లో కేవలం ఓ హీరోయిన్‏గా మాత్రమే కాకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే కథలను ఎంచకుంటూ ఎన్నో విజయాలను అందుకుంది సాయి పల్లవి. అందం, అభినయంతో హీరోకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కాల్షిట్ల కోసం బడా డైరెక్టర్స్.. ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తుంటారు. దక్షిణాది క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంద్భరంగా సాయి పల్లవికి సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెరపై అందంగా కనిపించాలంటే మేకప్ మాత్రమే ముఖ్యం కాదని.. సహజంగా కనిపిస్తూనే తన నటనతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకొని అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. సాయి పల్లవి పూర్తి పేరు.. సాయి పల్లవి సెంతామరై. తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరిలోని.. సెంతమరై కన్నన్, రాధ దంపతులకు జన్మించింది. సాయి పల్లవికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే తనకు నచ్చిన మ్యూజిక్ వింటూ అందుకు అనుగుణంగా కాళ్లు కదిపేది.. ఆ బాణీలకు తనదైన స్టైల్లో స్టెప్పులేసేది. జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్సు పూర్తిచేసింది. సాయి పల్లవి నటి కావాలని అనుకోలేదు.. ఆమెకు డ్యాన్స్ మీదున్న మక్కువతో 2009లో ఓ ప్రముఖ ఛానెల్లో నిర్వహించిన డ్యాన్స్ షోలో పాల్గోని ఫైనలిస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత 2008లో జయం రవి హీరోగా తెరకెక్కిన ధామ్ ధామ్ సినిమాలో నటించింది. 2014లో మలయాళ చిత్రం ప్రేమమ్‏లో హీరోయిన్‏గా నటించి మెప్పించింది. ఈ సినిమాతో సాయి పల్లవి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీలో భానుమతి పాత్రలో ఒదిగిపోయింది సాయి పల్లవి.. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొదటి సినిమాతోనే వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ న్యాచురల్ బ్యూటీ..

ఫిదా సినిమా తర్వాత.. సాయి పల్లవి నాని సరసన మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచె మనసు, మారి 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల శేఖర్ కమ్ముల , నాగ చైతన్య కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లవ్ స్టోరీ చిత్రంలో నటించింది. అలాగే న్యాచురల్ స్టార్ హీరో నాని నటించి శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో కనిపించి మెప్పించింది. అలాగే రానా దగ్గుబాటి సరసన నటించిన విరాట పర్వం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయి పల్లవి మేకప్ లేకుండానే సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాదు.. ఫెయిర్‏నెస్ క్రీమ్ ప్రచారాన్ని చేయడానికి ఆమెకు రూ.2 కోట్ల ఆఫర్ వచ్చింది. అయితే తనకు అసత్య ప్రచారాలను చేయడం ఇష్టం లేదని కోట్ల ఆఫర్‏ను రిజెక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Sarkaru Vaari Paata: ఆ నవ్వే ఇక్కడి వరకూ తీసుకొచ్చింది.. దర్శకుడు పరశురామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Macherla Niyojakavargam: రిలీజ్ డేట్ మార్చుకున్న యంగ్ హీరో.. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’లో అడుగు పెట్టేది అప్పుడే.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!