AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: క్లారిటీ వచ్చేసింది.. మరోసారి చైతూతో జత కట్టనున్న సాయి పల్లవి.. ఫ్రూవ్ ఇదే..

ఇటీవల ఆయన నటించిన కస్టడీ సినిమా పర్వాలేదనిపించుకుంది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తన తదుపరి సినిమా కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు చైతూ. మత్యకారులతో సముద్రం మధ్యలోకి వెళ్లిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ డ్రామా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Naga Chaitanya: క్లారిటీ వచ్చేసింది.. మరోసారి చైతూతో జత కట్టనున్న సాయి పల్లవి.. ఫ్రూవ్ ఇదే..
Naga Chaitanya, Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Sep 19, 2023 | 8:04 PM

Share

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు. లవ్ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న చైతూకు.. ఆతర్వాత అదే స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇటీవల ఆయన నటించిన కస్టడీ సినిమా పర్వాలేదనిపించుకుంది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తన తదుపరి సినిమా కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు చైతూ. మత్యకారులతో సముద్రం మధ్యలోకి వెళ్లిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ డ్రామా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. Thandel అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా గురించి నిత్యం ఏదో ఒక అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను గీతా ఆర్ట్స్ షేర్ చేసింది. అందులో చైతుతోపాటు డైరెక్టర్ చందూ మొండేటి, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కనిపించారు. ఇక వీడియోలో హీరోయిన్ ముఖం కనిపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు. అయితే ఆ వీడియోను గమనిస్తే అందులో కనిపిస్తుంది సాయి పల్లవి అని అర్థమవుతుంది. ఉంగరాల కురులు.. చేతికి జపమాల, వైట్ కుర్తాతో ఉన్న ఆ ఆమ్మాయి సాయి పల్లవి అనే కన్ఫార్మ్ అయిపోయింది. దీంతో మరోసారి లవ్ స్టోరీ కాంబో రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. చైతూకు జోడిగా మళ్లీ సాయి పల్లవి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించబోతున్నారని తెలుస్తోంది. చైతూ కెరీర్ లోనే అత్యధికంగా రూ.70 కోట్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారట. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.