Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regina Cassandra: అబ్బాయిలపై రెజీనా ఫన్నీ కామెంట్స్.. మ్యాగీతో పోల్చేసిందేంటీ..

ఈ క్రమంలో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. అబ్బాయిలపై ఫన్నీ కామెంట్స్ చేసింది.

Regina Cassandra: అబ్బాయిలపై రెజీనా ఫన్నీ కామెంట్స్.. మ్యాగీతో పోల్చేసిందేంటీ..
Regina
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 10, 2022 | 4:42 PM

చాలా కాలం తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో దూకుడు పెంచింది హీరోయిన్ రెజీనా కసాండ్రా. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్‏లో నటించింది రెజీనా. ఇక ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకిని డాకిని. ఇందులో రెజీనాతోపాటు మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం మెయిన్ రోల్ పోషిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సౌత్ కొరియా సూపర్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ చిత్రానికి రీమేక్‏గా వస్తోన్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. అబ్బాయిలపై ఫన్నీ కామెంట్స్ చేసింది.

ఆ వీడియోలో రెజీనా మాట్లాడుతూ.. నాకు అబ్బాయిల మీద పెద్ద జోక్ ఉంది. కానీ నేను వేయకూడదు ఇక్కడ. అబ్బాయిలు.. మ్యాగీ రెండు నిమిషాల్లో అయిపోతాయి అంటూ కామెంట్ చేసింది. ముందు ఈ కామెంట్ యాంకర్‏కు అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైన యాంకర్ వద్దూ అంటూ డైవర్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.