Rakul Preet Singh: కెరీర్ బిగినింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్
తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది రకుల్. ఒకానొక సమయంలో రకుల్ ప్రీత్ లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఉండేవి కావు అనడంలో అతిశయోక్తి లేదు. రకుల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసింది రకుల్. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

స్టార్ హీరోయిన్ గా ఒకానొక సమయంలో టాలీవుడ్ లో దూసుకుపోయిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది రకుల్. ఒకానొక సమయంలో రకుల్ ప్రీత్ లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఉండేవి కావు అనడంలో అతిశయోక్తి లేదు. రకుల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసింది రకుల్. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో ఈ భామకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.
ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేవు. ప్రస్తుతం తమిళ్ లో శివకార్తికేయన్ సినిమాలో నటిస్తుంది. అలాగే కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల్లో చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కేరీర్ బిగినింగ్ లో చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రకుల్ తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపింది. రకుల్ కు అంత ఈజీగా అవకాశాలు రాలేదట. ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ కూడా ఇచ్చిందట రకుల్. చిన్నతనం నుంచి నటి కావాలని కలలు కనేదట. ఇండస్ట్రీ గురించి తెలియకుండానే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాను అని తెలిపింది. అమ్మానాన్నను వదిలిపెట్టి ముంబై కు వచ్చి చాలా కష్టపడ్డాను అని తెలిపింది. సినిమా అవకాశాల కోసం క్యూ లో నిలబడ్డాను, ఏజెంట్ లకు దర్శకులకు ఫోన్లు చేసేదాన్ని.. ఒకొక్కసారి నాకు ఫోన్స్ వచ్చేయి కానీ చివరకు అవకాశాలు వేరే వాళ్లకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అని తెలిపింది. జీవితం ఎంతో పాఠం నేర్పించింది. అమ్మానాన్న ప్రోత్సహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని తెలిపింది రకుల్.
రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




