సెట్‌లో పాము కాటేసింది.. శరీరం నీలం రంగులోకి మారిపోయింది.. షాకింగ్ విషయం చెప్పిన ప్రేమ
టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుల్లో కోడిరామకృష్ణ ఒకరు. ఈ దివంగత దర్శకుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. సోషియో ఫాంటసీ సినిమాలకు పెట్టింది పేరు కోడిరామకృష్ణ. ఇప్పుడు రాజమౌళి సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. కోడిరామకృష్ణ సినిమాలకు అప్పట్లో అంతే క్రేజ్ ఉండేది.

టాలీవుడ్ లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ధర్మ చక్రం మూవీతో ప్రేమ హీరోయిన్ గా అడుగు పెట్టింది. అమాయకత్వం, అందం. అభినయంతో ఆకట్టుకుంది. ఇక ప్రేమ నటించిన దేవి సినిమా ఆ సమయంలో ఓ సంచనలం సృష్టించింది. కన్నడ, తమిళ్, తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించింది ప్రేమ. అయితే ప్రేమ హీరోయిన్ గా కెరీర్ అతి తక్కువ కాలమే.. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వరసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. తెలుగులో దేవి మూవీ కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ అయ్యింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంఎస్ రాజు ఈ సినిమాను తెరక్కించారు. ఆ సినిమాతోనే దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. అప్పట్లో దేవి మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది..
అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..
నటి ప్రేమ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెద్దగా వెలుగులోకి రాని సమయంలో, దేవి లాంటి సినిమా ఒక మహిళ పాత్రకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వొచ్చని, హిట్ కొట్టొచ్చని నిరూపించిందని ప్రేమ అన్నారు. సినిమా మొత్తంలో హీరో కనిపించకుండా, తన పాత్రే ప్రధానంగా ఉంటుందని, ఆ పవర్ దర్శకుడు కోడి రామకృష్ణ గారి వల్లే వచ్చిందని తెలిపారు. కోడి రామకృష్ణ గారు షాట్ వచ్చిన తర్వాత 15-20 టేకులైనా ఓపికగా ఎదురు చూసేవారని, సినిమాకు కావాల్సిన సీన్ తనకు ఎలా కావాలో స్పష్టంగా చెప్పేవారని వివరించారు.
గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..
దేవి గెటప్‌లో కళ్ళలో లెన్స్ పెట్టుకోవడం తనకు మొదటిసారని, దేవి పుత్రుడు సినిమా సమయంలో లెన్స్‌ల వల్ల కళ్ళు ఎర్రబడ్డాయని, కానీ దర్శకుడు అలాగే షాట్ కావాలని పట్టుబట్టారని తెలిపారు. అప్పట్లో షూటింగ్ డే అండ్ నైట్ జరిగేదని, కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతూ పనిచేసేవారని ప్రేమ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడంటే గ్రాఫిక్స్ వల్ల సినిమా తీయడం సులువుగా మారిందని, కానీ తమ సమయంలో రియాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పారు. నిజమైన పాములతో షూటింగ్ అనుభవాలు భయంకరంగా ఉంటాయని ప్రేమ వివరించారు. వైజాగ్‌లో దేవి షూటింగ్ సమయంలో ఒక నిజమైన పాము కెమెరామెన్‌ను కాటేసిందని, అతని శరీరం నీలం రంగులోకి మారిపోయిందని, రెండు రోజుల పాటు షూటింగ్ చేయలేదని ప్రేమ తెలిపారు. అలాగే సెట్‌లో ఒక పాము పట్టుకునే వ్యక్తి పాము కాటుకు గురై మరణించాడని, కులుములల్లి షూటింగ్‌లో కూడా కొన్ని పాములు చనిపోయాయని ప్రేమ గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత పాములతో పనిచేయాలంటే భయం వేసిందని, అప్పటి కష్టాలే సినిమాలకు శాశ్వత గుర్తింపు తెచ్చాయని ప్రేమ అన్నారు.
చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




