AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్

ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్

Phani CH
|

Updated on: Jan 31, 2026 | 12:01 PM

Share

కేంద్ర ఆర్థిక సర్వే జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధాన్ని సిఫార్సు చేసింది. ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు అధిక కొవ్వు, చక్కెర ఆహారాల ప్రకటనలను నిరోధించాలని సూచించింది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల వలన ఊబకాయం, మధుమేహం వంటి లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరుగుతున్నాయి. న్యూట్రిషన్ లేబులింగ్, శిశు ఉత్పత్తుల మార్కెటింగ్‌పై ఆంక్షలు విధించాలని కూడా సర్వే పేర్కొంది. ఇది దేశ ఆరోగ్య పరిరక్షణకు ఒక కీలక అడుగు.

అధిక కొవ్వు అధిక చక్కెర ఉన్న జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ఆర్థిక సర్వే సూచించింది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తాయో తెలిసిందే. దేశంలో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు ఇతర లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరగడానికి ఇవే కారణం. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. జంక్‌ఫుడ్‌తో పాటూ చిన్నారులు, పసిపిల్లల పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్‌పై కూడా ఆంక్షలు విధించాలని కీలక సూచన చేసింది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఆహార వినియోగాన్ని తగ్గించే అంశం గురించి ఈ సర్వే ద్వారా ప్రస్తావించారు. పిజ్జా, బర్గర్, నూడిల్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలతో వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల గురించి ప్రస్తావించారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 వరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించాలని, ఆహార పదర్థాల తయారీలో ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు, చక్కెర ఏ మోతాదులో వినియోగించారో తెలిపే న్యూట్రిషన్ లేబుల్‌ను ప్యాకెట్లపై ముద్రించాలని ఈ సర్వే సూచించింది . 2009-23 మధ్య జంక్ ఫుడ్ వినియోగం 150 శాతానికి పైగా పెరిగిందని, మహిళలు, పురుషుల్లో ఊబకాయం రెట్టింపు అయిందని ఈ సర్వే తెలిపింది. 2006లో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల రిటైల్ విక్రయాలు 0.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2019 నాటికి అది దాదాపు 40 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఈ సర్వే తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మమ్మకు మెసేజ్‌ పంపిన కో పైలట్‌ శాంభవి.. చివరికి..

Medaram Jathara: తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర విశిష్టత ఏంటంటే..

Medaram Jatara 2026: మేడారంలో వెలసిన సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పాయింట్లు

అమెరికా యుద్ధనౌకలు పశ్చిమాసియాలోకి ఇరాన్‌తో యుద్ధం తప్పదా

Black Egg: నల్ల కోడి గుడ్డు తిన్నారా ?? తింటే ఆయుష్షు పెరుగుతుందట