Pranitha Subhash: ఇది భక్తులు కలలో కూడా ఊహించనిది.. లడ్డు వివాదం పై ప్రణీత సుభాష్ వ్యాఖ్యలు

ఎవరు తిరుపతికి వెళ్లినా..ప్రసాదం ఎక్కడ అని ఆత్రంగా వెతికేది ఈ లడ్డూ కోసమే! ఎవరు తిరుమలకు వెళ్లొచ్చినా.. ఇంటికి వచ్చి..దీపారాధన చేసి..నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే! అమెరికాలో ఉన్నా..ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది ఈ లడ్డూ కోసమే! ఎప్పుడు తెలుగు గడ్డకు వచ్చినా..

Pranitha Subhash: ఇది భక్తులు కలలో కూడా ఊహించనిది.. లడ్డు వివాదం పై ప్రణీత సుభాష్ వ్యాఖ్యలు
Pranitha Subhash
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2024 | 9:41 PM

ఈ లడ్డూ పరమ పవిత్రం! ఈ లడ్డూ దొరకడం మహా భాగ్యం! తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేది..ఈ లడ్డూనే! ఎవరు తిరుపతికి వెళ్లినా..ప్రసాదం ఎక్కడ అని ఆత్రంగా వెతికేది ఈ లడ్డూ కోసమే! ఎవరు తిరుమలకు వెళ్లొచ్చినా.. ఇంటికి వచ్చి..దీపారాధన చేసి..నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే! అమెరికాలో ఉన్నా..ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది ఈ లడ్డూ కోసమే! ఎప్పుడు తెలుగు గడ్డకు వచ్చినా.. తిరుమలకు గబగబా మెట్లెక్కి శ్రీవారిని దర్శించి..ఆ స్వామి వర ప్రసాదంగా కళ్లకద్దుకుని తినేది ఈ లడ్డూనే! విశ్వరూపధారి అయిన తిరుమల గోవిందుడు..మన ఇంటికి వచ్చేది ఈ లడ్డూ రూపంలోనే! ఈ లడ్డూ కేవలం ప్రసాదం కాదు..కోట్లాది భక్తుల ఎమోషన్‌! ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తిరుమల లడ్డు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి జంతువుల కొవ్వుతో లడ్డులు తయారు చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, క్షమించరాని నేరం చేసిన వారిని వదలొద్దు అని ప్రజలు కోరుతున్నారు. ఇక దీని పై ఇప్పటికే చాలా మంది స్పందించారు. తాజాగా హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా తిరుమల లడ్డు వివాదం పై స్పందించింది.

శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం చాలా దారుణం.. ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇది వెంకటేశ్వరస్వామి భక్తులు కలలో కూడా ఊహించనిది” అంటూ సోషల్ ,మీడియాలో రాసుకొచ్చింది ప్రణీత సుభాష్. ఇక ప్రణీత తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవలేపండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.