Pragathi: ఒకానొక సమయంలో డబ్బులకోసం ఆ పని కూడా చేయాల్సి వచ్చింది.. ప్రగతి ఆసక్తికర కామెంట్స్
నటి ప్రగతి కూడా తన కష్టాల గురించి తెలిపారు. హీరోలకు అమ్మగా, అత్తగా, వదినగా, పిన్నిగా పలు రకాల క్యారెక్టర్స్ లో అలరించారు ప్రగతి. తనదైన సహజ నటనతో సినిమాల్లో రాణిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు చాలా మంది నటీ నటులు ఎన్నో కష్టాలు అనుభవించారు. సమయం వచ్చినప్పుడు పలు సందర్భాల్లో వారు పైన కష్టాలను.. ఎదుర్కొన్న గడ్డు కాలం గురించి చెప్పుకొచ్చారు. తినడానికి తిండి లేక.. ఫిలిం నగర్, కృష్ణ నగర్ రోడ్ల పై తిరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు. తాజాగా నటి ప్రగతి కూడా తన కష్టాల గురించి తెలిపారు. హీరోలకు అమ్మగా, అత్తగా, వదినగా, పిన్నిగా పలు రకాల క్యారెక్టర్స్ లో అలరించారు ప్రగతి. తనదైన సహజ నటనతో సినిమాల్లో రాణిస్తున్నారు. అంతే కాదు కామెడీతోనూ ఆమె నవ్వులు పూయిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించి నవ్వులు పూయించారు ప్రగతి.
ప్రగతి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. నాలుగు పదుల వయసులోనూ అందంగా కనబడటమే కాకుండా ఫిట్నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేసే వర్కౌట్ వీడియోస్ తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం గురించి తెలిపారు.
ఏ జాబ్ లేకుండా ఉన్న సమయంలో ఊరికే ఇంట్లో తిని కూర్చుంటున్నావ్ అని తన తల్లి అనే మాటలు నచ్చేవి కాదు అని అన్నారు. దాంతో ఆ మాటలు పడలేక పిజ్జా షాపులో పని చేశానని తెలిపింది. ఆతర్వాత డబ్బు కోసం ఎస్టీడీ బూత్‌లో కూడా పని చేశానని అన్నారు ప్రగతి. ఆ సమయంలో చాలా బొద్దుగా ఉండేదాన్ని దాంతో నాకు ఓ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. అలా మోడలింగ్ లోకి వచ్చాను.. అప్పుడే హీరోయిన్ గాను ఛాన్స్ లు వచ్చాయి. కానీ నేను వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయాను అన్నారు. అలాగే ఓ నిర్మాతతో జరిగిన గొడవ కారణంగా సినిమాలు మానేయాలని అనుకున్నారట. అలాగే 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నానని.. కానీ కొంతకాలానికే భర్తతో విభేదాలు రావడంతో విడిపోయానని తెలిపారు ప్రగతి.