కాబోయ్ భర్తను పరిచయం చేసిన యంగ్ బ్యూటీ.. తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పెళ్లిపీటలెక్కుతున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది పెళ్లిపీటలెక్కారు. అలాగే టాలీవుడ్ లోనూ చాలా మంది పెళ్లిపీటలెక్కుతున్నారు. తాజాగా ఓ యంగ్ బ్యూటీ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేసింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు

కాబోయ్ భర్తను పరిచయం చేసిన యంగ్ బ్యూటీ.. తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్
Actress

Updated on: Aug 28, 2025 | 9:06 AM

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిబాజాలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరోలు,హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటూ కొత్త జీవితాలు మొదలు పెడుతున్నారు. ఎంతో మంది ముద్దుగుమ్మలు డేటింగ్స్ , రిలేషన్స్ షిప్స్ అంటూ ప్రేమలో తేలిపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ తమ ప్రేమను చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. టైం చూసి తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెడుతున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ కూడా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. దాంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసు.. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఎవరో తెలుసా.?

పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేదా పేతురాజ్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఈ చిన్నది 2016లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే.. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో నివేదా పేతురాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా తెలుగులో నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, బ్లడీ మేరీ, విరాట పర్వం ,దాస్‌ కా ధమ్కీ నటించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్‌ కా ధమ్కీ సినిమాలో నటనతో పాటు తన అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

105 కేజీల బరువు పెరిగా.. పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

నిజం చెప్పాలంటే నివేదా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ వుమన్. తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా కార్ రేసింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఈ మధ్యన తన తమ్ముడితో కలిసి ఫార్ములా కారు రేసింగ్‌లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది ఈ అమ్మడు. నివేదకు కాబోయే భర్త పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్‌.. అతను దుబాయ్ లో వ్యాపారువేత్త అని తెలుస్తుంది. ఈ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ తమ ప్రేమను ఎక్కడా బయట పెట్టలేదు. రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఈ ఏడాదిలో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

బాప్ రే బాప్..! ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయినా..? ఎంత మారిపోయింది..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.