పెళ్లి చేసుకున్న తనీష్ హీరోయిన్

త‌నీష్ నటించిన `మేం వ‌య‌సుకు వ‌చ్చాం` సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులోకి 'వెళ్లిపోకే వెళ్లిపోకే..ఒంటరి చేసి వెళ్లిపోకే' పాట మంచి ఫేమస్.

  • Ram Naramaneni
  • Publish Date - 4:22 pm, Wed, 7 October 20
పెళ్లి చేసుకున్న తనీష్ హీరోయిన్

త‌నీష్ నటించిన `మేం వ‌య‌సుకు వ‌చ్చాం` సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులోకి ‘వెళ్లిపోకే వెళ్లిపోకే..ఒంటరి చేసి వెళ్లిపోకే’ పాట మంచి ఫేమస్. అప్పట్లో లవ్ ఫెయిల్యూర్స్‌ని ఈ పాట ఒక ఊపు ఊపేసింది.  ఈ సినిమాతో ఢిల్లీ భాత నీతి టేలర్ హీరోయిన్‌గా తెలుగు తెరకు ప‌రిచ‌య‌మైంది. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటున్న ఈ భామ..పెళ్లి చేసుకోనున్నాని సడన్‌గా చెప్పి షాకిచ్చింది. గుర్గావ్‌లోని గురుద్వారాలో చాలా కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో తమ వివాహం జరిగిందట. కొవిడ్-19 పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని భావించామని, గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటుచేసి పెళ్లి వార్త చెబుదామనుకున్నామని.. కానీ ఈ ఏడాదికి కరోనా వదిలేలా లేదు కాబట్టి ఇక చెప్పేశానని నీతి పేర్కొన్నారు. ఈ ముద్దుగుమ్మ త‌న చిన్న‌నాటి ఫ్రెండ్ ప‌రీక్షిత్ భ‌వ‌తో దాంపత్య జీవితం మొదలుపెట్టింది. ఆగ‌స్టు 13న పెళ్లి జరగ్గా, తాజాగా త‌న పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ని షేర్ చేసింది.  ( రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి)

సినిమాల‌కు దూరంగా  ఉంటున్నప్పటికీ ప్రైవేట్ మ్యూజిక్ వీడియోస్‌తో పాటు ప‌లు హిందీ టీవీ షోస్‌లో క‌నిపించి సంద‌డి చేసింది నీతి టేలర్. పెళ్లి పుస్త‌కం, ల‌వ్ డాట్‌కామ్ వంటి తెలుగు చిత్రాల్లో కూడా సందడి చేసింది ఈ భామ. ( ఆ ఆలయంలో దేవుడి సంచారం, ట్విస్ట్ ఏంటంటే..? )