సీనియర్‌ దర్శకుడు కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం

కన్నడ సీనియర్ దర్శకుడు నగేష్ బాబు(82) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయో భారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఇటీవల బెంగళూరులోని

సీనియర్‌ దర్శకుడు కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 07, 2020 | 4:47 PM

Director Nagesh Babu: కన్నడ సీనియర్ దర్శకుడు నగేష్ బాబు(82) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయో భారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఇటీవల బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కాగా మాండ్య జిల్లాలో జన్మించిన నగేష్.. ప్రేమాడ పుత్రి అనే మూవీ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. తూగుదీప, నన్న కర్తవ్య వంటి హిట్ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. అనిరీక్షిత అనే సినిమా ద్వారా దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. అంతేకాదు బెంగళూరులోని గాంధీ నగర్ ప్రగతి అనే పేరుతో ఓ స్టూడియోను కూడా నిర్మించారు. ఇక 2009లో ఆయన రూపొందించిన తత్వమసి-యు ఆర్ అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమైంది. మరోవైపు ఆయన మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Read More:

రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్‌

కరోనాను సీరియస్‌ తీసుకోండి.. కోలుకున్న అర్జున్‌ హెచ్చరిక

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu