ఆ ఆలయంలో దేవుడి సంచారం, ట్విస్ట్ ఏంటంటే..?

ఖమ్మం జిల్లా మధిరలోని ఓ దేవాలయంలో రాత్రి పూట దేవుడు ప్రత్యక్షమవుతున్నాడని, ఆలయంలో సంచరిస్తున్నారని, అందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలలో రికార్డు అయినట్లు మంగళవారం సోషల్ మీడియాలో వార్తలు తెగ సర్కులేట్ అయ్యాయి.

ఆ ఆలయంలో దేవుడి సంచారం, ట్విస్ట్ ఏంటంటే..?
Follow us

|

Updated on: Oct 07, 2020 | 12:43 PM

ఖమ్మం జిల్లా మధిరలోని ఓ దేవాలయంలో రాత్రి పూట దేవుడు ప్రత్యక్షమవుతున్నాడని, ఆలయంలో సంచరిస్తున్నారని, అందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలలో రికార్డు అయినట్లు మంగళవారం సోషల్ మీడియాలో వార్తలు తెగ సర్కులేట్ అయ్యాయి. దీంతో ఈ మిస్టరీ గుట్టేంటో తెలుసుకుందామని, మీడియా ప్రతినిధులు వెళ్లి సదరు సీసీ పుటేజ్‌లో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇక్కడే అసలు మిస్టరీ రివీల్ అయింది.  ఓ సీసీ కెమెరా అద్దంపై పురుగు వాలింది. అది కాసేపు దానిపైనే ఉండి అటూ, ఇటూ కదిలింది. ఆ ఆకారాన్ని దేవుడిగా భావించి రాత్రి వేళల్లో ఓ శక్తి వస్తుందని వదంతులు ప్రచారం చేశారు. అక్కడ పురుగు వాలిందని చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుందని, ఇలా ఎలా ప్రచారం చేశారని మీడియా ప్రతినిధులు ఆలయ నిర్వాహకులను ప్రశ్నించగా వారు మిన్నకుండిపోయారు.

Also Read : రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి