Nithya Menen: టీచరమ్మగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. తెలుగులో ఎంత చక్కగా పాఠాలు చెబుతుందో మీరే చూడండి
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నిత్య మేనన్ సడెన్‌గా టీచరమ్మగా మారిపోయింది. తాజాగా ఓ పాఠశాలకు వెళ్లిన ఈ ట్యాలెంటెడ్ నటి అక్కడ విద్యార్థులకు ఎంచెక్కా తెలుగు పాఠాలు నేర్పింది.

నిత్యమేనన్.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నటి. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఆలా మొదలైంది అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ సొగసరి తన అందం, అంతకు మించిన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేసినా పలు హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకుంది. నటనతో పాటు పాటలు పాడడం ఈ అమ్మడిలోని అదనపు ట్యాలెంట్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నిత్య మేనన్ సడెన్‌గా టీచరమ్మగా మారిపోయింది. తాజాగా ఓ పాఠశాలకు వెళ్లిన ఈ ట్యాలెంటెడ్ నటి అక్కడ విద్యార్థులకు ఎంచెక్కా తెలుగు పాఠాలు నేర్పింది. ‘చాలా అందంగా ఉన్న దుస్తులు కుడుతంది. తను హెల్ప్ చేస్తుంది. కుందేలు టైలర్‌తో మాట్లాడింది’ అంటూ తన ముద్దు ముద్దు మాటలతో తెలుగు పాఠాలను వివరించింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నా నూతన సంవత్సరం మొదటి ఏడాది ఇలా గడిచింది. కృష్ణాపురంలోని ఒక పాఠశాలకు వెళ్లాను. అక్కడి చిన్నారులతో మాట్లాడాను. అక్కడ వారు నేర్చుకున్నదానికంటే నేను నేర్చుకున్నది ఎక్కువ. వారితో గడిపినందుకు నా మనసెంతో ఆనందంగా ఉంది’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది నిత్య.
కాగా నిత్య పాఠాలు చెబుతోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కాగా ఇటీవల తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ట్రస్టుకు చెందిన ఏకం దేవాలయాన్ని సందర్శించింది నిత్య. అక్కడి సమీపంలోని కాంబాకం గిరిజనకాలనీకి వెళ్లి స్థానికులు, గిరిజన విద్యార్థులతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ గిరిజన బిడ్డని ఎత్తుకొని లాలిస్తూ, ఆడిస్తున్న ఫొటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది ఏడాది భీమ్లానాయక్, తిరు, వండర్ వుమెన్ సినిమాలతో సందడి చేసింది నిత్య. ఇందులో భీమ్లానాయక్, తిరు సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న ఐరన్ లేడీలో నిత్య టైటిల్ రోల్‌ను పోషించనుంది. అలాగే కొన్ని తమిళ్, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోం




View this post on Instagram