Tollywood: ఈ బూరెబుగ్గల పాప ఎవరో గుర్తుపట్టారా..? క్యూట్ హీరోయిన్.. ఆమె భర్త కూడా యాక్టరే
సెలబ్రిటీల చిన్నపాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌లా మారాయి. వాటిని ఫ్యాన్స్ నెట్టింట తెగ సర్కులేట్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో వైరల్ అవుతుంది. ఈమె ఎవరో గుర్తుపట్టారా... క్లూ ఏంటి అంటే తెలుగులో ఒక్క సినిమానే చేసింది.

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. సెలబ్రిటీల ఫోటోలే కనిపిస్తున్నాయి. అందులోనూ వారి చిన్నప్పటి పిక్స్ బాగా వైరల్ అవతున్నాయి. వాటిని ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. పై ఫొటోలో బొద్దుగా, ముద్దులోలికే బుగ్గలతో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు పెద్ద హీరోయిన్.. మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులు అవుతారు. క్యూట్.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, మాయ చేస్తుంది ఈ చిన్నది. యూత్‌కు ఆమె అంటే చాలా ఇష్టం. ఎమోషన్ సీన్లు వస్తే చెలరేగిపోతుంది. ఇంతకు ఈ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడు ఎవరో కాదు రాజా రాణి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నజ్రియా నజీమ్.
1994, డిసెంబర్ 20 పుట్టిన నజ్రియా.. బాల నటిగానే చాలా సినిమాల్లో నటించింది. ఆపై ఓ టీవీ హోస్ట్‌గా వర్క్ చేసింది. అనంతరం కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో స్టార్ హీరోయిన్ గా పేరొందిన ఈ బ్యూటీ పలు తమిళ్ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే సుందరానికి’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. నజ్రియా నజీమ్ భర్త ఫహద్ ఫాజిల్ కూడా చాలా పాపులర్. ఈయన కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో విలన్‌గా తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చాడు.
అయితే చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది నజ్రియా. ‘అంటే సుందరానికి’ తర్వాత దాదాపు రెండేళ్లపాటు ఖాళీగానే ఉంది. ఇటీవల సూర్య 43వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమె ఓకే చేసింది అంటే.. సినిమాలో పక్కాగా విషయం ఉంటుంది అన్నది ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం. మరి నజ్రియా మరో తెలుగు సినిమా ఎప్పుడు చేస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




