Tollywood : ఒక్క సీన్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన హీరోయిన్.. కానీ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూపులు.. ఎవరో తెలుసా ?..
కానీ ప్రతిభ ఎంత ఉన్నా కాసింత అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఒకప్పుడు ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఆ హీరోయిన్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. కనీసం చిన్న సినిమాలు కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు ఆమె సోషల్ మీడియాను నమ్ముకుంది. వరుసగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. ఇంతకీ ఎవరో గుర్తుకువచ్చిందా ?..

రెప్పపాటులో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. అందం, అభినయంతో అప్పట్లో కుర్రాళ్ల కలల రాణిగా మారింది. కానీ ప్రతిభ ఎంత ఉన్నా కాసింత అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఒకప్పుడు ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఆ హీరోయిన్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. కనీసం చిన్న సినిమాలు కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు ఆమె సోషల్ మీడియాను నమ్ముకుంది. వరుసగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. ఇంతకీ ఎవరో గుర్తుకువచ్చిందా ?.. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మలయాళీ కుట్టి. ఆమె చేసిన మొదటి చిత్రం భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఆమె ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ అదేం జరగలేదు. తనే హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.
మలయాలంలో ఒమర్ లవ్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ఒరు అదార్ లవ్’. ఈ మూవీతోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ప్రియా. ఈ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ’ పాటలో ప్రియా కన్ను కొట్టిన సీన్ అప్పట్లో వైరల్ అయ్యింది. ప్రియా వారియర్ చిన్ననాటి చిత్రాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘ఒరు అదార్ లవ్’లోని పాటను గమనించినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత ప్రియా నటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో ప్రియా ట్రోల్స్ కి ఫేవరెట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రియా హిందీలో శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటించింది.
తెలుగు, హిందీ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి. చివరగా సూప్రీం స్టార్ సాయి దుర్గ తేజ్ నటించిన బ్రో చిత్రంలో కనిపించింది. ఇందులో హీరో చెల్లి పాత్రలో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నెట్టింట నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రియా.. ఇటీవల సింగర్ గానూ అలరిస్తుంది. పాటలు పాడుతూ ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి. ప్రియా వాయిస్ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రియా వారియర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. ప్రియాకు 7.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రియా స్వస్థలం త్రిసూర్‌లోని పూంకున్నం.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




