Mamta Mohandas: ఆ స్టార్ హీరోతో యమదొంగ హీరోయిన్ డేటింగ్.. అసలు విషయం చెప్పిన మమతా మోహన్ దాస్..
క్యాన్సర్ తో పోరాటం తర్వాత చాలా కాలం విశ్రాంతి తీసుకున్న మమతా.. గతేడాది రుద్రంగి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అలాగే మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతంలో తమిళంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ మూవీ జూన్ 14న రిలీజ్ కానుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఈ సినిమాలో నెల్లూరు యాసలో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో భాషల్లో నటించి మెప్పించింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈ బ్యూటీ క్యాన్సర్ బారిన పడింది. కొన్నాళ్లపాటు చికిత్స తీసుకుని చివరకు కోలుకుంది. క్యాన్సర్ తో పోరాటం తర్వాత చాలా కాలం విశ్రాంతి తీసుకున్న మమతా.. గతేడాది రుద్రంగి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అలాగే మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతంలో తమిళంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ మూవీ జూన్ 14న రిలీజ్ కానుంది.
తాజాగా మహారాజా ప్రమోషన్లలో పాల్గొంటున్న మమతా మోహన్ దాస్ తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమతా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. “నాకు మలయాళీ చిత్రపరిశ్రమలో వచ్చిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను పోషించిన పాత్రలకు ప్రశంసలు వచ్చాయి. అందువల్లే తమిళం, తెలుగు భాషల్లో మూవీస్ చేసే అవకాశం వచ్చింది. మలయాళీ ప్రేక్షకులు నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ వంటి వారు నాపై ప్రశంసలు కురిపించారు” అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే డేటింగ్ రూమర్స్ పై స్పందిస్తూ..”గతంలో లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాను. కానీ మా రిలేషన్ ఎక్కువకాలం నిలవలేదు. జీవితంలో రిలేషన్ ఉండాలి. దానివల్ల వచ్చే ఒత్తిడిని మాత్రం నేను కోరుకోవడం లేదు. ఒకరి తోడు కచ్చితంగా కావాలని మాత్రం అనుకోవడం లేదు. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతం పార్ట్ నర్ కోసం వెతుకుతున్నా.. కాలంతోపాటు అన్ని విషయాలు బయటపడాల్సిందే. ” అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




